News November 30, 2025
తెలుసుకుందాం!

★ కర్నూలు అసలు పేరు ‘కందనవోలు’
★ కర్నూలులో ప్రవహించే నది: తుంగభద్ర
★ తుంగ నది జన్మస్థలం: కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లాలోని వరాహ పర్వతం
★ కేసీ కెనాల్ ఫుల్ ఫారం: కర్నూలు కడప కాలువ
★ కర్నూలు చివరి నవాబు: గులాం రసూల్ ఖాన్ బహదూర్
★ కర్నూలు జిల్లా విస్తీర్ణం: 17,658 చదరపు కిలోమీటర్లు
★ జిల్లాలో ప్రధాన వంటకాలు: ఉలవచారు, ఉగ్గాని బజ్జీ, రాయలసీమ కారం దోసె, రాగిముద్ద, నాటుకోడి చికెన్
Similar News
News March 5, 2026
కర్నూలు: 395 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

పత్తికొండ శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని తెలిపారు.
News March 5, 2026
కర్నూలులో రికార్డు ధర

కర్నూలు జిల్లా మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం బ్యాడిగ మిర్చి క్వింటా రూ.38,508 గరిష్ఠ ధర పలికింది. ఈ సీజన్‌లో ఇదే రికార్డు ధర కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సూపర్-10 రకం రూ.21,600, మిర్చి-5 రకం రూ.21,229, దేవనూరు డీలక్స్ రకం రూ.20,199, తేజ రకం రూ.19,600కు కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు.
News March 5, 2026
నంద్యాల: WOW.. 106 ఏళ్ల వయసులోనూ..!

నేటి కల్తీ ఆహారపు విషవలయంలో మానవుడి సగటు ఆయువు 70 ఏళ్లకే పరిమితమవుతుంటే, నంద్యాల(D) పాములపాడు మండలం చెలిమిళ్లకు చెందిన లక్ష్మమ్మ 106 ఏళ్లు పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వయసులోనూ ఆమె చూపు మందగించకపోవడం, తన పనులు తానే చేసుకోవడం విశేషం. ఆ రోజుల్లో తీసుకున్న రాగి సంగటి, జొన్నరొట్టెలు, కొర్రలు, సజ్జలు వంటి ప్రకృతి సిద్ధమైన ఆహారం ఆమెను నేటికీ ఆరోగ్యంగా ఉంచాయని మేనల్లుడు ఏసన్న తెలిపారు.


