News July 6, 2025
తెల్లం వర్సెస్ పొదెం..!

భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, పొదెం వీరయ్య మధ్య <<16950859>>వర్గపోరు <<>>రోజురోజుకూ ముదురుతోంది. దుమ్ముగూడెం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పొదెం చేసిన వ్యాఖ్యలతో వేడెక్కింది. సోషల్ మీడియాలో కౌంటర్‌లు చేసుకుంటున్నారు. ఇరువర్గాల పరస్పర ఆరోపణలు ఎటు దారి తీస్తాయో.. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్‌లో పరిస్థితి ఏంటని పార్టీ నాయకులే చర్చించుకుంటున్నట్లు టాక్.
Similar News
News July 6, 2025
వరల్డ్ అథ్లెటిక్స్ నిర్వహణ కోసం పోటీలో భారత్

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహించడం కోసం భారత్ బిడ్లు దాఖలు చేయనుంది. 2029, 2031 ఎడిషన్ల కోసం బిడ్లు వేయనున్నట్లు నేషనల్ ఫెడరేషన్ స్పోక్స్ పర్సన్ ఆదిల్ సుమారివాలా వెల్లడించారు. ఏదైనా ఒక ఎడిషన్‌ను నిర్వహించే అవకాశం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. బిడ్ల దాఖలుకు గడువు ఈ ఏడాది OCT1తో ముగియనుంది. హోస్ట్‌ల వివరాలను వరల్డ్ అథ్లెటిక్స్ వచ్చే ఏడాది SEPలో ప్రకటిస్తుంది.
News July 6, 2025
నిజామాబాద్‌లో సందడి చేసిన నటి అనసూయ

నిజామాబాద్ నగరంలో నటి అనసూయ ఆదివారం సందడి చేసింది. హైదరాబాద్ రోడ్డులోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పలు పాటలకు స్టెప్పులు వేసి ఉర్రూతలూగించారు. ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంత మంది అభిమానులు ఉండటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.
News July 6, 2025
శ్రీకాకుళం: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచాలి

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల, స్కూల్ స్వీపర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. మెనూ ఛార్జీలు ఒక్కొక్క విద్యార్థికి కనీసం రూ.20/-లు ఇవ్వాలని కోరారు. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు.