News January 3, 2026
తెల్లవారుజామున ప్రయాణాలు చేయకండి: వరంగల్ సీపీ

వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడంతో వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదాచారులను గుర్తించేందుకు వీక్షణ సామర్థ్యం తక్కువగా ఉంటుందన్నారు. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నందున, ప్రజలు ఈ సమయాల్లో ప్రయాణాలను మానుకోవాలన్నారు.
Similar News
News February 18, 2026
ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత

AP: విశాఖ AUలో ఉద్రిక్తత నెలకొంది. SFIకి వ్యతిరేకంగా ABVP కార్యకర్తలు నినాదాలు చేస్తూ VC ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే టైమ్‌లో SFI నేతలు అక్కడికి వచ్చి ప్రతినినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు రాకుండా మెయిన్ గేటుకు తాళాలు వేశారు. AUలో నిన్న RSS మార్చ్‌ను SFI అడ్డుకున్న నేపథ్యంలో వివాదం ఏర్పడింది.
News February 18, 2026
ప్లీట్ రివ్యూలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ దంపతులు

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని వారు కలిశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, గవర్నర్ నజీర్, కేంద్ర మంత్రులు, నౌకదళ అధిపతులు, విదేశీ ప్రముఖులు పాల్గొన్నారు. యుద్ధనౌకల సామర్థ్యం వివరిస్తూ ఫీట్ రివ్యూ కొనసాగుతోంది.
News February 18, 2026
క్లీనింగ్ టిప్స్ మీ కోసం..

* ముత్యాల నగలు మురికిగా అయితే ఆలివ్ నూనెలో ముంచిన దూదితో తుడవండి.
* బట్టలపై నూనె పడితే ఉప్పు అద్దిన నిమ్మకాయతో రుద్దండి.
* షవర్ రంధ్రాలు మూసుకుపోతే, వైట్ వెనిగర్‌తో శుభ్రం చేసుకోవచ్చు.
* ఫ్రిజ్ లోపల దుర్వాసన వస్తోంటే వంటసోడాలో కాసిని నీళ్ళు కలిపి తుడిస్తే సరిపోతుంది.
* బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో కీరదోసను ముక్కలుగా కోసి పెడితే, వాటి బెడద తగ్గుతుంది.


