News October 25, 2024
తొండంగి: భర్త అనుమానాస్పద మృతి.. భార్య, ప్రియుడు అరెస్టు
కాకినాడ జిల్లా తొండంగి మండలం AV నగరానికి చెందిన మధు(38) అనుమానాస్పద మృతి కేసులో శిరీష, ఆమె ప్రియుడు ప్రశాంత్‌ను ఎస్సై జగన్మోహన్రావు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. శిరీషకు10 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి కుమార్తె ఉంది. శిరీష ఆమె ప్రియుడు కలిసి మధును హత్య చేశారని చెప్పారు. గత శుక్రవారం మధు అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించి అంత్యక్రియలు జరిపారు. దీనిపై అనుమానాలు రావడంతో ఇద్దరిని అరెస్టు చేశారు.
Similar News
News November 22, 2024
తూ.గో: CBI నుంచి అంటూ ఫేక్ కాల్
పి.గన్నవరానికి చెందిన ఓ వైద్యవిద్యార్థిని తండ్రికి గురువారం డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది. CBI నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ వ్యక్తి(పై ఫోటో) వాట్సాప్ కాల్ ద్వారా బెదిరించాడు. మీ కుమార్తెను అరెస్ట్ చేశామని, తమ అదుపులో ఉందని చెప్పాడు. అయితే కొద్దిసేపటి ముందే తన కుమార్తెతో మాట్లాడిన చంద్రశేఖర్ ఫేక్ కాల్ అని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి ట్రాప్ కాల్స్ వలలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
News November 22, 2024
ఉభయ గోదావరి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఐదుగురే.!
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు చివరకు ఐదుగురే మిగిలారు. ఉపఎన్నికల్లో ఒక నామినేషన్ ఉపసంహరణ అనంతరం ఐదుగురు అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ గురువారం తెలిపారు. 1.గంధం నారాయణరావు, 2.దీపక్ పులుగు, 3.నాగేశ్వరరావు కవల, 4.నామన వెంకట లక్ష్మీ, 5.బొర్రా గోపీ మూర్తి అభ్యర్థులు బరిలో నిలిచినట్లు చెప్పారు. 5న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు.
News November 22, 2024
కాగ్ అధిపతిగా కోనసీమ జిల్లా వాసి ప్రమాణ స్వీకారం
ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను అమలాపురం మాజీ ఎంపీ కెఎస్ఆర్ మూర్తి కుమారుడు కొండ్రు సంజయ్‌మూర్తి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘనత సాధించారు. 1964 డిసెంబర్ 24న జన్మించిన ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.