News February 28, 2025

తొండింగి: పీక కోసుకొని యువకుడి ఆత్మహత్య

image

తొండింగి మండలంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తమ్మయ్య పేటలో భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భర్త పీక కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాలు.. కిర్లంపూడి(M) రామచంద్రపురానికి చెందిన కుందేటి లోవరాజు (28) భార్య నాగలక్ష్మికి తరచూ గొడవలు నేపథ్యంలో మనస్థాపం చెంది ఇంటిపై వాటర్ ట్యాంకు వద్ద పీక కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Similar News

News November 12, 2025

BRIC-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

image

<>BRIC<<>>-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌ 5 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఎస్సీ, MVSC, డిప్లొమా ఉత్తీర్ణత, NET/GATE/GPAT అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. 40-50ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ils.res.in

News November 12, 2025

గోదావరిఖని: బాంబు పేలుళ్ల నేపథ్యంలో అలర్ట్‌

image

ఢీల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రామగుండం పోలీస్‌ కమీషనరేట్‌లో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. మంగళవారం రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షేట్టిపేట, అన్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసుల నేతృత్వంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రద్దీగా ఉండే ప్రాంతాలలో పోలీసులు బాంబు స్క్వాడ్‌, జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. నాగబంది నిర్వహించి, వాహనాల తనిఖీలు చేపట్టారు.

News November 12, 2025

కొబ్బరి చెట్టుకు ఎరువులను ఎలా వేస్తే మంచిది?

image

కొబ్బరి చెట్టుకు ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ తవ్విన పళ్లెములో వేసినప్పుడే, అవి నేలలో ఇంకి, వేర్లు, గ్రహించడానికి వీలు పడుతుంది. చెట్టు కాండమునకు ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల దూరంలో 15 సెంటీమీటర్ల లోతున చుట్టూ గాడిచేసి, ఎరువులను చల్లి, మట్టితో కప్పి వెంటనే నీరు కట్టాలి. చెట్లకు ఉప్పువేయటం, వేర్లను నరికివేయడం వంటి అశాస్త్రీయమైన పద్ధతులను పాటించవద్దు. దీని వల్ల చెట్లకు హాని కలుగుతుంది.