News June 26, 2024
తొందర పడకండి ఎమ్మెల్యేలతో కేసీఆర్

ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో నేతలతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న పలువురు ఎమ్మెల్యేలతో సమావేశం కాగా, ఇవాళ హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
Similar News
News February 28, 2026
మనోహరాబాద్: లింగారెడ్డిపేటలో చిరుత కలకలం!

లింగారెడ్డిపేట గ్రామ శివారులో చిరుత దాడిలో రెండు దూడలు మృత్యువాత పడ్డాయి. రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్యకు చెందిన పశువులపై చిరుత దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పాదముద్రల ఆధారంగా ఆనవాళ్లను సేకరించారు.
News February 28, 2026
MDK: శాంతి భద్రతల భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

మెదక్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా మార్చి 1 నుంచి 31 వరకు పోలీసు యాక్ట్ 1861 సెక్షన్ 30, 30(ఎ) అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిషేధమన్నారు. చట్టవ్యతిరేక చర్యలు, ఆస్తి నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News February 28, 2026
మెదక్: నాలుగో రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4,869 మందికి గాను 4,799 మంది, ఒకేషనల్ విభాగంలో 540 మందికి గాను 525 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా 98.42% హాజరు నమోదైందని వివరించారు.


