News February 26, 2025

తొర్రూరులో వైన్ షాప్ నిర్వాహకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన

image

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో ఎన్నికల కోడ్‌ను వైన్ షాప్ నిర్వాహకులు ఉల్లంఘించారని స్థానికులు తెలిపారు. వైన్ షాప్ నిర్వాహకులు ఎన్నికల సమయపాలనకు తూట్లు పొడిచారన్నారు. ఎన్నికల అధికారులు కూడా చూసీ చూడనట్టుగా ఉండడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాప్‌లు మూసివేయాల్సి ఉండగా, సీల్ వేసిన వైన్ షాప్‌ను మళ్లీ తెరిచి కొనసాగించడం ఏంటని చర్చించుకుంటున్నారు.

Similar News

News February 26, 2025

ములుగు జిల్లా కలెక్టర్ సూచన 

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాలకు సరిపడా సిబ్బందిని నియమించడంతో పాటు మరో 20 శాతం అదనపు సిబ్బందిని రిజర్వులో ఉంచామన్నారు. జిల్లాలో 628 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని వివరించారు.

News February 26, 2025

ADB జిల్లాలో 31 ఇంటర్ పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఎస్ఈకి సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేర్చాలన్నారు.

News February 26, 2025

జనసేన ఆవిర్భావ వేడుకలు.. కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఈయనే..!

image

జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. కర్నూలు పార్లమెంటుకు చింతా సురేశ్ నియమితులయ్యారు. కాగా, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని, మార్చి 14న పిఠాపురంలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

error: Content is protected !!