News February 16, 2026

తొర్రూరు, జనగామలకు అబ్జర్వర్ల నియామకం

image

తొర్రూరు, జనగామ మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇందుకు ప్రత్యేక అబ్జర్వర్లను నియమించారు. తొర్రూరు బాధ్యతలను ఎంపీ రఘురాంరెడ్డి, MLAలు రాజేందర్ రెడ్డి, నాగరాజులకు అప్పగించగా, జనగామ ఇన్‌ఛార్జులుగా MLAలు బీర్ల ఐలయ్య, గండ్ర సత్యనారాయణరావును నియమించారు. రేపు జరగనున్న ఎన్నికల ప్రక్రియను వీరు పర్యవేక్షించనున్నారు.

Similar News

News April 14, 2026

ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

image

AP: కడప(D) ఒంటిమిట్టలో ఇవాళ 45°C ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల(D) సంజామల 44.2°C, తిరుపతి(D) వరదయ్యపాలెంలో 43.8°C ఉష్ణోగ్రత నెలకొంది. 262 మండలాల్లో 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు SDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News April 14, 2026

కొవిడ్ వ్యాక్సిన్‌తోనే నాన్న చనిపోయారు: వార్న్ కుమారుడు

image

స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణానికి కారణం కరోనా వ్యాక్సిన్ అని ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాక్సిన్‌‌తో తన తండ్రి అనారోగ్య సమస్యలు ముదిరాయని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ఇష్టం లేకపోయినా ఇతరుల ఒత్తిళ్లతో ఆయన టీకా డోసులు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని అంత్యక్రియలప్పుడే చెప్పాలని అనుకున్నా కొన్ని కారణాలతో ఆగిపోయానని అన్నారు. కాగా షేన్ వార్న్ 2022లో చనిపోయారు.

News April 14, 2026

పాలకోడేరు: ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి

image

గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక భారత నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.