News October 5, 2025

తొర్రూరు: హాస్పిటల్‌ సిబ్బందిపై దాడి.. నలుగురికి రిమాండ్

image

తొర్రూరు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటాపురానికి చెందిని నలమాస ప్రశాంత్ మిత్రులు చికిత్సపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై హాస్పిటల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి, కోర్టుకు రిమాండ్‌ నిమిత్తం పంపినట్లు తొర్రూరు ఎస్సై ఉపేందర్ తెలిపారు.

Similar News

News April 13, 2026

ఇంటర్ ఫలితాలు.. 1000కి 997 మార్కులు

image

TGలో నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. MPCలో సాయి శ్రేష్ఠిత 1000కి 997, BiPCలో కె.జ్యోత్స్న, హఫ్సాబేగం 1000కి 997 చొప్పున స్కోర్ చేశారు. ఇక ఫస్టియర్‌ MPCలో పలువురు విద్యార్థులు 470కి 469 మార్కులు సాధించారు. నేటి నుంచి ఈ నెల 20వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు బోర్డు అవకాశం కల్పించింది. రీకౌంటింగ్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.100 చొప్పున, రీవెరిఫికేషన్‌కు రూ.800 చొప్పున చెల్లించాలి.

News April 13, 2026

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

image

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్కెట్లో రేటు తగ్గినా నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం(PDPS) అమలుకు శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉంటే ఆ తేడా మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఇది అమల్లోకి వస్తే ధర తగ్గినా రైతులకు నష్టం కలగదు.

News April 13, 2026

బ్రహ్మ చేసిన పొరపాటు ఏంటి?

image

ఉదధిలోన నీళ్లు ఉప్పలుగా జేసె
పసిడి గలుగు వాని పిపిన జేసె
బ్రహ్మదేవు సేత పదడైన సేతరా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ అందులోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి అతడిని పిసినారిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం.<<-se>>#PADHYAM<<>>