News September 2, 2025

తొర్రూర్: వైజాగ్ టూర్‌కు స్పెషల్ బస్సు

image

తొర్రూరు పరిసర ప్రాంత ప్రజలు వైజాగ్ యాత్ర స్పెషల్ సర్వీసును వినియోగించుకోవాలని డిపో మేనేజర్ పద్మావతి కోరారు. ఈ బస్సు ఈనెల 12న ఉ.5 గం.కు తొర్రూరు నుంచి బయలుదేరి పరిటాల హనుమాన్ ఆలయం, విజయవాడ కనకదుర్గ గుడి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, సింహాచలం, ఆర్కే బీచ్ సందర్శించి 14న ఉదయం తొర్రూరుకు చేరుకుంటుందన్నారు. యాత్ర టికెట్ ధర పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.1,300గా నిర్ణయించినట్లు తెలిపారు.

Similar News

News September 2, 2025

టీచర్లు టెట్ పాస్ అయితేనే..: సుప్రీంకోర్టు

image

ప్రభుత్వ టీచర్లుగా కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనీసం ఐదేళ్లు సర్వీసు ఉన్నవారంతా టెట్ పాస్ కావాల్సిందేనని తెలిపింది. ఇందుకోసం రెండేళ్ల గడువు విధించింది. ఆ లోపు అర్హత సాధించని వారు ఉద్యోగాలు కోల్పోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కాగా ఉమ్మడి ఏపీలో 2012లో తొలిసారి టెట్ నిర్వహించారు. అంతకుముందు ఉద్యోగంలో చేరిన 30వేల మందిపై ప్రభావం పడనుంది.

News September 2, 2025

7న వాడపల్లిలో దర్శనాల నిలిపివేత

image

కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7వ తేదీ ఆదివారం దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. ఆ రోజు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నందున మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయాన్ని మూసివేస్తామన్నారు. సంప్రోక్షణ, పూజల అనంతరం సోమవారం ఉదయం నుంచి యథావిధిగా దర్శనాలు పునఃప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 2, 2025

KNR: 12 ఏళ్లు దాటింది.. చేనేత ఎన్నికలెప్పుడు..?

image

ఎన్నికలతో చేనేత సహకార సంఘాలకు పూర్వ వైభవం వస్తుందేమోనని నేతన్నలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కోరిక నెరవేరడం లేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ ఎనిమిదేళ్లుగా ఎన్నికలు ఊరిస్తూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 27 చేనేత, 11,430 మరమగ్గాల సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి 2013లో ఎన్నికలు నిర్వహించగా, పదవీ కాలాన్ని పొడగిస్తూ వస్తున్నారు. పాలకవర్గాలు పదవీ బాధ్యతలు స్వీకరించి 12 ఏళ్లు దాటిందని చేనేత కార్మికులు తెలిపారు.