News February 14, 2026
తొర్రూర్: 2 సార్లు ఓటమి.. 3వ సారి గెలుపు!

తొర్రూర్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో అభ్యర్థుల మధ్య గట్టి పోటీ జరిగింది. గతంలో కాంగ్రెస్ నుంచి 2013లో భార్య, 2020లో భర్త పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి భార్య ఎన్నికల బరిలోకి దిగి, బీఆర్ఎస్ అభ్యర్థిపై 241 ఓట్ల మెజారిటీతో గెలిచి, కౌన్సిల్ స్థానాన్ని సాధించింది. 2 సార్లు ఓడినా, 3వ సారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కాగా, గతంలో తన ప్రత్యర్థి కూడా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు.
Similar News
News March 9, 2026
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ రవీందర్, ఏసీపీలు, డీఈలు, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
News March 9, 2026
చిరంజీవి రాంగ్ టైమ్‌లో పార్టీ పెట్టారు: శివాజీ

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై నటుడు శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘చిరంజీవి రాష్ట్రం విడిపోయిన తర్వాత పార్టీ పెట్టి ఉండాల్సింది. అలా అయితే సీమాంధ్రలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేవారు. రాంగ్ టైమ్‌లో పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల వరకైనా పార్టీని కొనసాగించి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవారేమో’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
News March 9, 2026
ట్రోఫీతో గుడికి.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

1983 WC విజేత, TMC MP కీర్తి ఆజాద్ టీమ్ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. T20 WC ట్రోఫీతో <<19333290>>హిందూ ఆలయానికి<<>> వెళ్లడాన్ని తప్పుబట్టారు. టీమ్ఇండియా 140 కోట్ల భారతీయులు, అన్ని మతాలను రిప్రజెంట్ చేస్తుందని.. కేవలం ఒక మతానిదో లేదా జై షా కుటుంబానిదో కాదని విమర్శించారు. సిరాజ్ మసీదుకు లేదా శాంసన్ చర్చికి ట్రోఫీని తీసుకెళ్లలేదన్నారు. ఒకే మతం చుట్టూ విజయాన్ని తిప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.


