News February 13, 2026
తొర్రూర్: 9 వార్డులో మొత్తం 1282 ఓట్లు.. బీఎస్పీకి ఒక్క ఓటు రాలే!

తొర్రూర్ మున్సిపాలిటీలోని 9వ వార్డులో అత్యంత ఉత్కంఠ పోరు నెలకొంది. 9వ వార్డు SC-W రిజర్వ్డ్ అయింది. అయితే, బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కిన్నెర కవిత 451 ఓట్లు సాధించి, కేవలం 13 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన(438 ఓట్లు)పై విజయం సాధించారు. ఈ వార్డులో మొత్తం 1282 ఓటర్లు ఉండగా.. 901 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 12 ఓట్లు రాగా.. బీఎస్పీకి ఒక్క ఓటు కూడా రాకపోవడం గమనార్హం.
Similar News
News February 14, 2026
కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసింది: KTR

TG: లోకల్ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రభావం బాగా పెరిగిందని BRS నేత KTR పేర్కొన్నారు. కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ఆశించిన సీట్లు రాలేదని INCలో అసంతృప్తి ఉంది. BJPకి ఓట్లు, వార్డులు తక్కువ వచ్చినా అంతా బాగున్నట్లు చెప్పడం ఎందుకో అర్థం కావడం లేదు. మా పార్టీ గట్టిగా పోరాడింది. ఇప్పుడున్న 17 మున్సిపాల్టీలతో పాటు హంగ్ స్థానాల్లోనూ ఎక్కువ గెలుచుకుంటాం’ అని మీడియాతో చెప్పారు.
News February 14, 2026
నిరుపేదల ఆశాజ్యోతి దామోదరం సంజీవయ్య: కలెక్టర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమాలను కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుపేదల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి సంజీవయ్య అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. దామోదరం విజయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్ గౌడా, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విశ్వమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News February 14, 2026
చిత్తూరు: ఈ ఏడాది నీటి ఎద్దడి లేనట్లే.!

కృష్ణా జలాలతో ఈ ఏడాది జిల్లాలో నీటి ఎద్దడి తప్పింది. పుంగనూరు తంబళ్లపల్లె, మదనపల్లె, నియోజకవర్గాలలోని అన్ని చెవులకు, పలమనేరులో కొన్ని చెరువులకు హంద్రి-నీవా ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. తంబళ్లపల్లెలో రెండు, మదనపల్లెలో 4 చెవులకు నీటిని మళ్లించారు. పుంగనూరులో 2, పలమనేరులో కొంత మేర చెరువులకు PBC నుంచి నీటిని తరలిస్తారు. ఎక్కడన్నా నీటి సమస్య వస్తే ఎదుర్కొనుందేకు సిద్ధమని అధికారులు తెలిపారు.


