News October 1, 2024

తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసుకుంటాం: స్టీల్ ప్లాంట్ అధికారులు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ED ఆఫీస్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ధర్నాకి యాజమాన్యం దిగొచ్చింది. తొలగించిన 4290 మంది కాంట్రాక్ట్ కార్మికులకు బయోమెట్రిక్ గేట్ పాసులు యథావిధిగా కొనసాగిస్తామని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మంగళవారం రాత్రి హామి ఇచ్చింది. లిఖిత పూర్వకంగా తమకు హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు వెల్లడించారు.

Similar News

News October 1, 2024

విశాఖలో అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్

image

విశాఖ నగరంలోని ముడసర్లోవ ఈస్ట్ పాయింట్ గోల్డ్ క్లబ్ మరో అంతర్జాతీయ గోల్డ్ టోర్నమెంటుకు వేదికయ్యింది. ఈ మేరకు మంగళవారం నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యంత ప్రతిష్టాత్మక ది ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) పేరుతో రెండు నుంచి 5వ తేదీ వరకు టోర్నమెంట్ నిర్వహించనుంది. ఈ పోటీలో దేశ విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొనున్నారు. విజేతలకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

News October 1, 2024

రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది..?: బొత్స

image

ఆంధ్ర రాష్ట్రంలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం విశాఖ వైసీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. మద్యంపై దృష్టి పెట్టి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తోందని అన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

News October 1, 2024

టెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: విశాఖ కలెక్టర్

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న టెట్ (కంప్యూటర్ బేస్డ్ – టెస్ట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. టెట్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 60,574 మంది హాజరుకానున్నారు. అభ్యర్థులకు జిల్లాలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.