News January 16, 2026
తొలిసారిగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ

TG: రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని పొంగులేటి చెప్పారు.
Similar News
News February 20, 2026
ఇమ్యునిటీని పెంచే ఫ్రూట్స్ ఇవే..

చలికాలంలో ఇమ్యునిటీ తగ్గిపోయి త్వరగా రోగాల బారిన పడుతుంటారు. దీనికి చెక్ పెట్టాలంటే కొన్ని ఫ్రూట్స్ డైట్‌లో యాడ్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. నారింజ, యాపిల్, దానిమ్మ, కివి తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. వీటితో పాటు శరీరానికి తగినంత విటమిన్ డి లభించేలా చూసుకోవాలి. అలాగే ఈ కాలంలో వేడినీరు, జావలు, సూప్‌లు తీసుకోవడం కూడా మంచిదని సూచిస్తున్నారు.
News February 20, 2026
అభిషేక్ వైఫల్యం.. సోదరిపై ట్రోలింగ్స్

T20WCలో అభిషేక్ వైఫల్యానికి సోదరి కోమల్ కారణమంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్‌కూ వెళ్తూ స్టాండ్స్‌లో అరుస్తూ అభిషేక్ ఆటను నాశనం చేస్తున్నారంటూ పోస్టులు చేస్తున్నారు. ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా POTM అవార్డుల సమయంలో ఫ్యామిలీ ఫొటోలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటున్నారు. అయితే నిరాధారంగా ఆమెను టార్గెట్ చేస్తున్నారని, గ్రౌండులో సోదరుడు ఫెయిలైతే కోమల్ ఎలా కారణమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
News February 20, 2026
ఏడాది చివరికల్లా 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు: సత్యకుమార్

AP: సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, రంపచోడవరం, బుట్టాయిగూడెంలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఈ ఏడాది చివరి కల్లా వినియోగంలోకి తెస్తామని మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో తెలిపారు. ‘వీటి నిర్మాణానికి గత GOVT ₹12 కోట్లే ఇచ్చింది. మిగతా నిధులన్నింటినీ ఇచ్చి మా ప్రభుత్వమే పూర్తిచేయిస్తోంది. 300 మంది వైద్యుల్ని నియమించాం. ఇన్‌సర్వీస్, సీనియర్ రెసిడెంట్ల విభాగంలో 600మందిని ఏర్పాటు చేశాం’ అని వివరించారు.


