News July 17, 2024

తొలి ఏకాదశి SPECIAL.. ఈ ఆలయాలకు వెళుతున్నారా?

image

నేడు తొలి ఏకాదశి నేపథ్యంలో HYD, ఉమ్మడి RRతో పాటు రాజధానికి చేరువలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ ఆలయాల్లో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చిలుకూరు బాలాజీ, వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి,స్వర్ణగిరి, మేడ్చల్ బద్రీనాథ్, చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి, బంజారాహిల్స్ పూరీ జగన్నాథ్, బిర్లా మందిర్, శామీర్ పేట రత్నాలయం, సంఘి, బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, అమ్మపల్లి సీతారామాలయంలో ఏర్పాట్లు చేశారు. SHARE IT

Similar News

News September 24, 2024

HYD: డిగ్రీ సీట్లకు 25 నుంచి స్పాట్ ప్రవేశాలు

image

దోస్త్ పరిధిలోని ప్రైవేట్, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో స్పాట్ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు స్పాట్ విధానంలో సీట్లను ఆయా కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ప్రొ.ఆర్. లింబాద్రి తెలిపారు. స్పాట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఓరిజినల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, ఫొటో, ఆధార్ కార్డ్, 2 జిరాక్సు సెట్స్ తీసుకురావాలని కోరారు.

News September 24, 2024

పటాన్‌చెరులో నేడు రేషన్ డీలర్ల సభ

image

నేడు పటాన్చెరులో న్యాయమైన డిమాండ్‌లకు రేషన్ డీలర్ల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని రాష్ట్ర అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి (MLA), రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాయికోటి రాజు తెలిపారు. ఓ కన్వెన్షన్ హాల్‌లో జరిగే సభకి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో డీలర్లు హాజరు కానున్నారు. అలాగే ఈ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారని రేషన్ డీలర్ల సంఘం సభ్యులు తెలిపారు.

News September 24, 2024

HYD: ఇకపై అన్నింటికీ ఒకే డిజిటల్ కార్డు

image

రాష్ట్రంలో రేషన్, ఆరోగ్యం, ఇతర సంక్షేమాలన్నింటికీ ప్రతి కుటుంబానికి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండేలా ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. HYDలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. కుటుంబ సభ్యుల మార్పు, చేర్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఈ కార్డు రూపొందించనున్నారు. సమగ్ర కుటుంబ వివరాల నమోదుపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.