News December 9, 2025
తొలి టీ20: టాస్ ఓడిన భారత్

కటక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయాల నుంచి కోలుకున్న హార్దిక్, గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
IND: సూర్య(C), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్
SA: మార్క్రమ్(C), డికాక్, స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, జాన్‌సెన్, మహరాజ్, నోర్ట్జే, సిపామ్లా, ఎంగిడి
Similar News
News March 4, 2026
గ్యాస్ ఉత్పత్తిని నిలిపేస్తున్నాం: ఖతర్

లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(LNG), అనుబంధ ప్రొడక్టుల ఉత్పత్తిని <<19269644>>నిలిపేస్తున్నట్లు<<>> ఖతర్ ప్రకటించింది. ‘గ్యాస్‌ను లిక్విడ్‌గా మార్చే ప్రక్రియను ఆపేస్తున్నాం. నెల రోజులు సూపర్ చిల్డ్ గ్యాస్ ఉత్పత్తి, ఎగుమతి చేయలేం’ అని చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. గ్లోబల్ LNG ఎగుమతుల్లో ఖతర్ వాటా 20%. తాజా నిర్ణయంతో ఇండియా, జపాన్, చైనా, యూరప్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. యూరప్, ఆసియాలో గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి.
News March 4, 2026
చెలరేగుతున్న న్యూజిలాండ్

T20WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీఫైనల్లో న్యూజిలాండ్ విధ్వంసం సృష్టిస్తోంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 84 రన్స్ చేసింది. సీఫర్ట్ (21 బంతుల్లో 41*), అలెన్ (15 బంతుల్లో 43*) బౌండరీలతో విరుచుకుపడుతున్నారు. ఇద్దరూ కలిసి 5 సిక్సర్లు, 9 ఫోర్లు బాదారు.
News March 4, 2026
ఖమేనీ రెండో కొడుకు ఆస్తి ఎంతో తెలుసా?

ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైనట్లు సమాచారం. ఆయనకు బ్రిటన్‌లో 100 మిలియన్ పౌండ్ల విలువైన 11 ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలుస్తోంది. షెల్ కంపెనీల ద్వారా భారీగా ఆస్తులు, గోల్డ్ కూడబెట్టినట్లు నిపుణుల అంచనా. అలాగే ఆఫ్రికన్ దేశాల్లో బ్యాంకులు, స్విస్ బ్యాంకులో ఖాతాలు, ప్రైవేట్ జెట్ ఉన్నాయని తెలుస్తోంది. <<19292894>>IRGC<<>>కి నిధులు సమకూర్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.


