News March 21, 2025
తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

జిల్లాలో మొదటిరోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఈఓ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 8,627 మంది విద్యార్థులకు గాను మొదటి రోజు 8,616 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 11 మంది గైర్హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
Similar News
News July 4, 2025
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు: వాతావరణ కేంద్రం

తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, NZB, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, MHBD, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, MBNR జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
News July 4, 2025
HYD: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ ట్వీట్

మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల గురించి మాజీ మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా గురువారం ఆసపత్రిలో చేరారన్నారు. బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం 1, 2రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్య సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.
News July 4, 2025
పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు: రేవంత్

TG: రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం అని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ‘కేంద్రం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేశాం. ఎవరూ పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు. వాటితోనే గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. కొత్త నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి. కష్టపడి మళ్లీ INCని అధికారంలోకి తేవాలి’ అని TPCC కార్యవర్గ సమావేశంలో పేర్కొన్నారు.