News January 1, 2026

తోటమూల: మైక్ వివాదం.. హిందూ సంఘాల రాస్తారోకో

image

గంపలగూడెం మండలం తోటమూల చర్చి వద్ద మైక్ సౌండ్ తగ్గించమన్నందుకు హరికృష్ణపై జరిగిన దాడిని నిరసిస్తూ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. తిరువూరు-మధిర ప్రధాన రహదారిపై బైఠాయించిన నిరసనకారులు.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నేతలు కోరారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Similar News

News January 29, 2026

ధర్మవరం దక్కదా? రాప్తాడు ఆప్షన్!

image

ధర్మవరం నుంచి 2029లో మళ్లీ మంత్రి సత్యకుమార్ పోటీ చేస్తారని BJP నేత హరీశ్ బాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. 2024లో సీటు త్యాగం చేసిన పరిటాల శ్రీరామ్ భవిష్యత్తుపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో రాప్తాడు నుంచి ఓటమి చెందిన శ్రీరామ్‌ను ఎలాగైనా MLAగా చూడాలని అనుచరులు కోరుకుంటున్నారు. ధర్మవరం సీటు దక్కని పక్షంలో ఆయన మళ్లీ రాప్తాడు నుంచి బరిలోకి దిగుతారా అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

News January 29, 2026

కర్నూలు: వారెవ్వా.. 85 ఏళ్ల వయసులో బంగారు పతకం

image

కేరళలో జరుగుతున్న 46వ జాతీయ స్థాయి 5 కిలోమీటర్ల పరుగు పందెంలో కర్నూలుకు చెందిన మద్దిలేటి రెడ్డి బంగారు పతకం సాధించి స్ఫూర్తిగా నిలిచారు. 85 ఏళ్ల వయసులో మద్దిలేటి రెడ్డి సాధించిన గెలుపును ప్రశంసిస్తూ రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్, జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు సురేంద్ర ప్రశంసించారు. పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

News January 29, 2026

పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

image

పసిపిల్లల్లో కడుపునొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది. సాధారణంగా వైరస్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు, నులి పురుగులు, కోలిక్ సమస్య వల్ల చిన్నారుల్లో కడుపునొప్పి వస్తుంది. సాధారణంగా ఇవి రెండురోజుల్లో తగ్గిపోతాయి. తగ్గకపోగా విరేచనాలు, వాంతులు కూడా అవుతుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఇంట్లో ఉండి నాటు వైద్యాలు చేయడం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.