News February 10, 2026

‘తోతాపురి’ టన్ను రూ.1,05,000

image

AP: వేసవి రాకముందే మామిడి ఎగుమతులు ఊపందుకుంటున్నాయి. రేట్లు కూడా భారీగా పెరిగి రైతులకు లాభాలు తెస్తున్నాయి. NTR(D) విస్సన్నపేట నుంచి ఎగుమతి అయిన తోతాపురి మామిడి రకానికి ముంబై మార్కెట్‌లో రికార్డు స్థాయిలో టన్ను రూ.1,05,000 రేటు పలికింది. ఉత్తరాదిన డిమాండ్ కారణంగానే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కాగా గతేడాది సీజన్ చివరలో చిత్తూరులో తోతాపురి టన్ను రూ.12-14వేలకు పడిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News February 10, 2026

ఎప్‌స్టీన్‌తో మస్క్, జుకర్‌బర్గ్.. ‘వైల్డ్’ డిన్నర్ ఫొటో వైరల్!

image

ఎప్‌స్టీన్ ఫైల్స్ టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. 2015లో ఎప్‌స్టీన్ ఏర్పాటు చేసిన ఓ ‘వైల్డ్’ డిన్నర్‌లో మస్క్, జుకర్‌బర్గ్ పాల్గొన్నట్లు ఓ ఫొటో బయటపడింది. ఎప్‌స్టీన్ స్వయంగా తన మెయిల్‌లో దీని గురించి ప్రస్తావిస్తూ వారితో డిన్నర్ అదిరిపోయిందని రాసుకున్నాడు. అంతేకాదు గతంలో మస్క్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎప్‌స్టీన్ ప్రైవేట్ ఐలాండ్‌లో పార్టీ ఎప్పుడు ఉంటుందని అడిగిన మెయిల్స్ కూడా బయటకొచ్చాయి.

News February 10, 2026

సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

image

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

News February 10, 2026

ESIC మోడల్& సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

కేరళ, కొల్లాంలోని <>ESIC <<>>మోడల్& సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ 19 స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 19న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ, MCh/DM/DNB/DrNB/MD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.50. వెబ్‌సైట్: https://esic.gov.in