News November 8, 2024
“తోపుడు బండి సాదిక్” ఇక లేరు.. ఎక్స్‌లో హరీశ్ రావు ఎమోషనల్ ట్వీట్

కల్లూరుకు చెందిన “తోపుడు బండి సాదిక్”గా పేరొందిన సాదిక్ అలీ మృతి బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం X ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. వివిధ రకాలుగా సాదిక్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజల మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయని తెలిపారు. పిల్లల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు తోపుడు బండిలో పుస్తకాలు పెట్టుకుని పంపిణీ చేశారని చెప్పారు.
Similar News
News November 4, 2025
పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్ శ్రీజ

రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. విద్యార్థుల హాజరు శాతంపై దృష్టి సారించాలని, వెనుకబడిన వారికి అదనపు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. హాజరు శాతం 90కి పైగా ఉండేలా తల్లిదండ్రులతో నిరంతరం ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు.
News November 4, 2025
6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు: అ.కలెక్టర్

ఈనెల 6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం పత్తి కొనుగోలు పై మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, జిన్నింగ్ మిల్ యాజమాన్యం, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ పిలుపుమేరకు సీసీ కొనుగోలు కేంద్రాలకు ఆ రోజు పత్తి తీసుకురావద్దని సూచించారు.
News November 4, 2025
మాన్యువల్ స్కావెంజింగ్ రహిత జిల్లాగా ఖమ్మం: కలెక్టర్

సుప్రీంకోర్ట్ ఆదేశాలతో జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్ల పరిశీలన చేపట్టినట్లు, ఖమ్మం జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు కనుగొనలేదని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం జిల్లా మాన్యువల్ స్కావెంజింగ్ రహితంగా ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి స్కావెంజర్ల పరిశీలన నిశితంగా పరిశీలించారన్నారు.


