News January 4, 2025
తోపుదుర్తి చందశేఖర్ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందశేఖర్ రెడ్డిపై టీడీపీ నేతలు పరశురామ్, విజయకుమార్ జిల్లా ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో చంద్రబాబు, నారా లోకేశ్‌ను దూషిస్తూ వ్యక్తిగతంగా దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజే అనుకొని ఉండుంటే మొద్దు శ్రీనుతో లోకేశ్‌ని చంపించేవాడని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిపారు.
Similar News
News January 6, 2025
అనంతపురంలో KG టమాటా రూ.6
అనంతపురంలో టమాటా ధరలు బాగా పడిపోయాయి. నిన్న కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.10 పలికిందని రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ వెల్లడించారు. మరోవైపు కనిష్ఠ ధర రూ.6గా నమోదైందన్నారు. మొత్తంగా నిన్న ఒక్కరోజు మార్కెట్‌కు 1050 టన్నులు రాగా సరాసరిగా కిలో టమాటా రూ.8 పలికింది.
News January 6, 2025
అనంతపురం: ఒకేరోజు ఏడుగురి మృతి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం పలు విషాద ఘటనలు జరిగాయి. ఒక్కరోజే ఏడుగురు చనిపోయారు. రొద్దం, పెద్దపప్పూరు, తాడిపత్రిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పెనుకొండలో ఆవు అడ్డు రావడంతో<<15074331>> మహిళ<<>> , అనంతపురంలో డివైడర్ ఢీకొని ఇంటర్ <<15073707>>యువకుడు<<>> చనిపోయారు. అలాగే గుత్తి ఆర్టీసీ కండక్టర్ గుండెపోటుతో కన్నుమూశారు.అలాగే శనివారం అర్ధరాత్రి దాటాక పెద్దవడుగూరు హైవేపై ఐచర్ వాహనం ఢీకొని మరొకరు చనిపోయారు.
News January 6, 2025
అనంతపురంలో పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని స్థానిక నీలం సంజీవరెడ్డి మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు APSLPRB అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8, 9 & 10 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను.. 17, 18 & 20 వ తేదీలకు మార్పు చేస్తూ వాయిదా వేశారు. వైకుంఠ ఏకాదశి పండుగ , ఇతర శాంతి భద్రతల కారణాలతో 3 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.