News June 11, 2024
త్రిపురాంతకం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

త్రిపురాంతకం మండలం కేసినేనిపల్లి ఫ్లైఓవర్ వద్ద లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి ఆర్మీ జవాన్ ఓబులేసు (35)గా పోలీసులు గుర్తించారు. ఇతడిది పోరుమామిళ్ల గ్రామమని, బంధువులకు సమాచారం అందించినట్లు
ఎస్సై సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News December 27, 2025
ప్రకాశం: డిసెంబర్ 31 జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ.!

జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించనున్నారు. జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొత్తం 2,82,576 మంది పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ నిమిత్తం రూ.125కోట్ల 2లక్షల 5వేల 5వందల నిధులు విడుదలయ్యాయి. 30వ తేదీన సచివాలయ సిబ్బంది నగదును డ్రా చేయనున్నారు.
News December 27, 2025
ప్రకాశం: చాక్లెట్లు ఇస్తానని ఇద్దరు చిన్నారులపై అత్యాచారం

ఇద్దరు చిన్నాలకు తినుబండారాలు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడిన ఘటన వైపాలెం (M)నర్సాయపాలెంలో జరిగినట్లు SI చౌడయ్య తెలిపారు. ఆంజనేయులు గ్రామంలో చిల్లర కొట్టు నడిపేవాడు. క్రిస్మస్ రోజు బాలికలకు(10,11) చాక్లెట్ల ఆశ చూపి ఓ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం, తర్వాత మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.
News December 27, 2025
ప్రకాశం: CMపై అసభ్యకర పోస్టులు.. టీచర్‌పై కేసు

సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టిన టీచర్ పై శుక్రవారం కేసు నమోదైనట్లు ఎస్సై శ్రీరామ్ తెలిపారు. కనిగిరికి చెందిన టీచర్ శ్రీనివాసులు చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియోలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ నాయకుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నామన్నారు. ఇలా మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


