News September 15, 2024

త్రిపురారం: మాజీ ఎంపీపీ భర్తపై కత్తితో దాడి

image

త్రిపురారం మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ భర్త అనుముల శ్రీనివాస్ రెడ్డిపై ఆదివారం సాయంత్రం ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. తాగిన మైకంలో ఉన్న యువకుడు ఓ విషయంలో న్యాయం చేయలేదంటూ శ్రీనివాస్ రెడ్డి పై దాడి చేయడంతో కడుపులో రెండు చోట్ల గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదు తరలించారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 22, 2024

నల్గొండ నుంచి మంత్రి పదవి ఎవరికో..?

image

డిసెంబర్ 7లోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవీ దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య ఉన్నట్లు తెలుస్తొంది. కాగా ఇప్పటికే NLG నుంచి క్యాబినేట్‌లో ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారు.

News November 22, 2024

NLG: ర్యాగింగ్‌కు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు: కలెక్టర్

image

విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం తన చాంబర్లో నిర్వహించిన ర్యాగింగ్ వ్యతిరేక జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ర్యాగింగ్ సంఘటన బాధాకరమని అన్నారు. ఇకపై ఇలాంటివి జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

News November 22, 2024

NLG: మధ్యాహ్న భోజన పంపిణీపై కలెక్టర్ జూమ్ మీటింగ్

image

జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పంపిణీ విషయంలో జిల్లాలోని MEOలు, ప్రధానోపాధ్యాయులతో జూమ్ మీటింగ్ ద్వారా తగు సూచనలు చేశారు. పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణంలో తాజా కూరగాయలు, నాణ్యమైన వంట దినుసులతో శుభ్రం చేసిన వంట పాత్రలలో వండాలన్నారు. వండిన భోజనాన్ని ముందుగా హెచ్ఎం, మధ్యాహ్న భోజన ఇంచార్జీ రుచి చూసిన తరువాత మాత్రమే విద్యార్థులకు అందజేయాలని అన్నారు.