News August 6, 2024

త్రిబుల్ ఐటీ కళాశాల సమస్యలను పరిష్కరించండి: ఎంపీ వినతి

image

కర్నూలులోని త్రిబుల్ ఐటీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కర్నూలు ఎంపీ నాగరాజు కోరారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎంపీ మాట్లాడుతూ.. త్రిబుల్ ఐటీ కళాశాలలో ఖాళీగా ఉన్న 36 బోధన, బోధనేతర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరినట్టు తెలిపారు.

Similar News

News February 15, 2026

రేపు కర్నూలు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీల పరిష్కారం సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి కనుక్కోవచ్చని పేర్కొన్నారు. Meekosam.ap.gov.in అర్జీలు నమోదు చేసుకోవాలన్నారు.

News February 15, 2026

కర్నూలు: నీటి కుంటలో పడి 12 ఏళ్ల బాలుడి మృతి

image

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి ఉత్సాహంతో వెళ్లిన యాత్ర విషాదంగా ముగిసింది. ఆలూరు మండలం తుంబలబీడుకు చెందిన సలువప్ప చిన్న కుమారుడు ఎం.సిద్ధార్థ(12) శివరాత్రి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లాడు. అక్కడ ప్రధాన రహదారి పక్కన ఉన్న నీటి కుంటలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 15, 2026

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి హెచ్చరిక

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ ఆళ్లగడ్డ తాలూకా నాయకుడు సజ్జల నాగేంద్ర ఖండించారు. శిరివెళ్లలో ఆయన మాట్లాడుతూ.. చేతనైతే కరవు సీమలో కన్నీళ్లు తుడిచే పనులు చేయాలని బైరెడ్డికి సూచించారు. విలువలతో కూడిన రాజకీయం మీలాంటి ఫ్యాక్షన్ రాజకీయ నాయకులకు అర్థం కాదన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.