News August 15, 2025
త్రివర్ణ శోభతో ముస్తాబైన కామారెడ్డి కలెక్టరేట్

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ త్రివర్ణ రంగుల విద్యుత్ కాంతులతో చూపరులను ఆకట్టుకుంటుంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్ కాంతులతో కలెక్టరేట్ భవనాన్ని ముస్తాబు చేశారు. రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ ఛైర్మన్ కోదండ రెడ్డి పాల్గొననున్నారు.
Similar News
News August 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 15, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.43 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.42 గంటలకు
✒ ఇష: రాత్రి 7.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 15, 2025
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న బీర్ల ఐలయ్య

జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని జనగామ డీపీఆర్‌వో బండి పల్లవి తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ, 9:40 గంటలకు పోలీసుల గౌరవ వందనం, 9:50 గంటలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జిల్లా అభివృద్ధిపై ప్రసంగం ఉంటుందని పేర్కొన్నారు.
News August 15, 2025
‘ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరు మెరుగుపడాలి’

ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. వైద్య విధాన పరిషత్‌లో కొనసాగుతున్న జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ గురువారం సాయంత్రం జిల్లా కార్యాలయంలో సమీక్ష జరిపారు. బోధన్‌లోని జిల్లా ఆసుపత్రితో పాటు ఆర్మూర్, భీంగల్, ధర్పల్లి ఏరియా ఆసుపత్రులు, డిచ్పల్లి, వర్ని, మోర్తాడ్, కమ్మర్పల్లి, నవీపేట్ వైద్యులు వైద్య సేవలందించాలని సూచించారు.