News January 14, 2026
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే ఇలా చేయండి

పిల్లల్ని కనడం అనేది చాలా మంది మహిళల కల. దీని కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. విటమిన్ D, C స్థాయిలు సరిగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. 3 నెలల ముందునుంచి ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News February 21, 2026
బొప్పాయి తోటల్లో గొంగళి పురుగుల నివారణ ఎలా?

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్‌పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.
News February 21, 2026
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

<
News February 21, 2026
రెండో పెళ్లిపై మీనా క్లారిటీ

తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నటి మీనా తెలిపారు. ‘నా సెకండ్ మ్యారేజ్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. రూమర్స్ స్ప్రెడ్ చేసే వారు నాకు టీనేజ్ కూతురు ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇలాంటి వార్తలు చూసినప్పుడు బాధగా ఉంటుంది, కోపం వస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీనా భర్త విద్యాసాగర్ 2022లో మరణించారు. ప్రస్తుతం ఆమె మోహన్‌లాల్‌తో ‘దృశ్యం-3’లో నటిస్తున్నారు.


