News January 10, 2026

త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: శ్రీధర్ బాబు

image

TG: నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. గ్రూప్స్ ద్వారా ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాగా ఇటీవల జాబ్ క్యాలెండర్ కోరుతూ విద్యార్థులు <<18794438>>ఆందోళన<<>> చేపట్టిన విషయం తెలిసిందే.

Similar News

News February 13, 2026

బంగ్లాదేశ్ ఎన్నికల్లో 2 బ్యాలెట్లు.. ఎందుకు?

image

బంగ్లాదేశ్ <<19125261>>ఎన్నికలు<<>> 2 బ్యాలెట్లతో జరిగాయి. అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఒక బ్యాలెట్ పేపర్, ‘జులై ఛార్టర్’పై రెఫరెండానికి రెండోది. 2025 అక్టోబర్‌లో 25 పార్టీలు చేసుకున్న ఒప్పందమే జులై ఛార్టర్‌. దీన్ని అమలు చేయాలని మెజారిటీ(65%పైగా) ప్రజలు ఓటు వేసినట్లు సమాచారం. PM పదవీ కాలంపై పరిమితులు, EC బలోపేతం, PM నుంచి ప్రెసిడెంట్‌కు అధికారాల బదిలీ వంటివి ఇందులో ఉన్నాయి. 180 పని దినాల్లో ఈ సంస్కరణలు అమలు చేయాలి.

News February 13, 2026

ఈ సెంటిమెంట్ రిపీటైతే టీ20 వరల్డ్ కప్ ఇండియాదే!

image

జింబాబ్వే సంచలన విజయం టీమ్ఇండియా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 1983 ODI WC, 2007 T20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు T20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లోనూ జింబాబ్వే ఆసీస్‌ను చిత్తు చేయడంతో ఆ అరుదైన ‘సెంటిమెంట్’ రిపీట్ అవుతుందని గూగుల్ ఇండియా విశ్లేషించింది. ఈ లక్కీ ఫ్యాక్టర్ నిజమైతే SKY సేన కప్పు గెలవడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News February 13, 2026

ఈ విజయం మా బాధ్యతను పెంచింది: రేవంత్

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌కు విజయాన్ని కట్టబెట్టారని ప్రజలకు CM రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్ల పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ తీర్పుతో సంపూర్ణ ఆమోదం తెలిపారని ట్వీట్ చేశారు. ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలను గొప్పగా అభివృద్ధి చేసి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం చేస్తున్నామన్నారు.