News March 20, 2025
త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్: పరిగి MLA

త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఏర్పాటు కానుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. షాద్‌నగర్ పరిగి మధ్యలోని లక్ష్మీదేవిపల్లి దగ్గర సాగునీటి ప్రాజెక్టు నిర్మించి, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగునీరు, తాగునీరు అందించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఇప్పటికి కూడా కోర్టు కేసులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
Similar News
News March 20, 2025
NLG: నాలుగేళ్లుగా టీఏ, డీఏలకు అతీగతీ లేదు!

జిల్లాలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు నాలుగేళ్ల నుంచి టీఏ, డీఏలకు అతీగతీ లేకుండాపోయింది. గతంలో ప్రతి నెలా రెండు మీటింగ్‌లకు రూ.500 చెల్లించేవారు. ఆ తర్వాత ప్రతి నెల ఒక సమావేశానికే టీఏ, డీఏ చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. ఒక్కో అంగన్‌వాడీ టీచరుకు కనీసం రూ.20 వేల వరకు టీఏ, డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక కూరగాయలు, వంట సామగ్రి, గ్యాస్ సిలిండర్లకు చెల్లింపులను అసలే పట్టించుకోవడంలేదు.
News March 20, 2025
GOOD NEWS: షుగర్, ఊబకాయానికి మందు వచ్చేస్తోంది!

డయాబెటిస్, అధిక బరువుతో బాధపడేవారికి ఎలీ లిల్లీ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. వాటి చికిత్సకు ఉపకరించే ఔషధాన్ని మౌంజారో పేరిట భారత మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఔషధం 2.5 మి.గ్రా ధరను రూ.3500గా, 5 మి.గ్రా ధరను రూ.4375గా నిర్ణయించింది. ఇది ఇప్పటికే పలు దేశాల్లో అందుబాటులో ఉండగా భారత్‌లోకి రావడం ఇదే తొలిసారి. దేశంలో షుగర్, ఒబేసిటీ బాధితులు 10కోట్లకు పైగానే ఉంటారని ఓ అంచనా.
News March 20, 2025
శ్రీ సత్యసాయి: 171 మందికి బదిలీలు

జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 171 మందికి బదిలీ ప్రక్రియ నిర్వహించినట్లు డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ క్యాడర్‌లలో పనిచేస్తున్న వారికి గురువారం బదిలీలు చేపట్టామన్నారు. 21 మంది ఏపీవోలు, 50 మంది కోఆర్డినేటర్స్, 18 మంది ఈసీ, 81 మంది టెక్నికల్ అసిస్టెంట్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు.