News April 22, 2025

త్వరలో అంగన్వాడి పోస్టుల భర్తీకి చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన ICDS అధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సక్రమంగా అందించి పిల్లల ఎత్తు, బరువు పెరిగే విధంగా పని చేయాలని సూచించారు. బలహీనంగా ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Similar News

News November 7, 2025

నెల్లూరు: భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు

image

మనుబోలు పరిధిలోని భార్య హత్య కేసులో ముద్దాయి రాపూరు శ్రీనివాసులు @ చిన్నోడుకు జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2018 జులై 2వ తేదీ తమ కుమార్తె ప్రేమ వివాహం విషయమై భార్య రాపూరు వెంకటరమణమ్మతో చిన్నోడికి తగాదా జరిగింది. ఆ కోపంతో నెల్లూరు నుంచి KR పురం వెళ్తుండగా మార్గమధ్యలో ఆటోను ఆపి ఆటో జాకీ రాడ్‌తో భార్యపై దాడి చేసి హత్య చేశాడు.

News November 7, 2025

ఉలవపాడు: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

ఉలవపాడు మండలం చాగల్లు–వీరేపల్లి మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి గాయత్రి మిల్క్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పాల వాహనం డ్రైవర్ రాకొండి దుర్గా మహేష్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది మద్దిపాడు మండలం వెల్లంపల్లిగా స్థానికులు గుర్తించారు. ఇంకా వివాహం కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అంకమ్మరావు తెలిపారు.

News November 7, 2025

వందేమాతరాన్ని ఆలపించిన నెల్లూరు కలెక్టర్

image

స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన దేశభక్తి గేయం వందేమాతరం అని నెల్లూరు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా కొనియాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో వందేమాతరం గేయాన్ని శుక్రవారం ఉదయం ఆలపించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.