News January 3, 2026

త్వరలో అక్కడ మల్కాజిగిరి.. ఇక్కడ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు..!

image

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో గత రాచకొండ నూతన పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పుడు రాచకొండను మల్కాజిగిరిగా పేరు మార్చిన వేళ, ఇదే మల్కాజ్గిరి కమిషనరేట్‌గా మేడిపల్లిలో అందుబాటులోకి రానుంది. మరోవైపు.. HYD శివారులో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం స్కిల్ యూనివర్సిటీ సమీపంలో 150 ఎకరాలు కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిషనరేట్ అక్కడ ఏర్పాటు కానుంది.

Similar News

News February 15, 2026

కోటప్పకొండకు వెళ్తున్నారా? ఈ నంబర్ నోట్ చేసుకోండి!

image

కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తుల రక్షణ కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. దొంగతనాలు, వేధింపుల నివారణకు మఫ్టీలో క్రైమ్ టీమ్‌లను మోహరించారు. స్నానాల ఘాట్ల వద్ద చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా తప్పిపోయినా లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే పోలీస్ అవుట్‌పోస్ట్‌లను గానీ, 9440900885 నంబర్‌ను గానీ సంప్రదించాలని ఆయన కోరారు.

News February 15, 2026

కెప్టెన్సీ నుంచి ధోనీని బలవంతంగా తప్పించిన బీసీసీఐ!

image

2017లో భారత జట్టు కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడానికి గల కారణాలను మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపే తాజాగా వెల్లడించారు. కెప్టెన్‌గా దిగిపోవాలని అప్పటి చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్, తాను కోరినట్లు తెలిపారు. అందుకు MS అంగీకరించారని, రాతపూర్వకంగా తెలియజేయాలని కోరితే ఈమెయిల్‌ పంపారని చెప్పారు. ఆ తర్వాత కోహ్లీకి మద్దతుగా నిలిచారని కొనియాడారు. 2014లో టెస్టులకు, 2020 ODI, T20లకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు.

News February 15, 2026

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు: ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఓవర్ స్పీడ్ 1,189, హెల్మెట్ లేకుండా 1,075, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 260 కేసులతో పాటు 1,069 డ్రంక్ అండ్ డ్రైవ్, 1,908 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.