News November 11, 2025

త్వరలో ఆర్డీటీకి శుభావార్త!

image

గ్రామీణ పేదల ఆశాదీపం ఆర్డీటీ సంస్థకు మళ్లీ విదేశీ నిధులు అందనున్నాయి. నాలుగేళ్లుగా నిలిచిపోయిన FCRA లైసెన్సు రెన్యువల్ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. FCRA రెన్యవల్ విషయమై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హోం మంత్రి అమిత్ షాతో పలుమార్లు చర్చించారు. జిల్లా ఎమ్మెల్యేలు సైతం అమిత్ షాను కలిసి ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు.

Similar News

News November 11, 2025

లేటెస్ట్ అప్‌డేట్స్

image

⋆ విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన NIA.. సిరాజ్ ఉర్ రెహమాన్(VZM), సయ్యద్ సమీర్(HYD) యువతను టెర్రరిజంవైపు ప్రేరేపించేలా కుట్ర పన్నారని అభియోగాలు
⋆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై వెనక్కి తగ్గిన YS జగన్.. NOV 21లోగా CBI కోర్టులో హాజరవుతానని స్పష్టీకరణ.. యూరప్ వెళితే NOV 14లోగా కోర్టులో హాజరుకావాలని గతంలో ఆదేశించిన కోర్టు
* జూబ్లీహిల్స్‌లో 50.16% ఓటింగ్ నమోదు

News November 11, 2025

సచివాలయ సిబ్బందికి మెమోలు జారీ చెయ్యండి: కలెక్టర్

image

మక్కువ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న గ్రీన్ అంబాసిడర్లును విధుల నుంచి తొలగించమని ఈవో బెహరా శ్రీనివాస్‌ను కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రీన్ అంబాసిడర్లకు విధుల నుంచి తొలగించడంతో పాటు సచివాలయంలో పనిచేస్తున్న 9 మంది సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఎంపీడీవోకు ఆదేశించారు.

News November 11, 2025

పెదగంట్యాడలో ఎంఎస్ఎంఈ పార్క్‌కు శంకస్థాపన

image

రాష్ట్రంలో ప్రతి ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం పెదగంట్యాడలో ఎం.ఎస్.ఎం.ఈ పార్క్‌కి మంత్రులు డీఎస్ బీవీ స్వామి, వాసంశెట్టి సుభాష్, ఎంపీ శ్రీ భరత్ శంఖుస్థాపన చేశారు. ఒకే రోజు రాష్ట్రంలో 27 ఎం.ఎస్.ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయడం చారిత్రాత్మక ఘట్టం అన్నారు.