News April 11, 2025

త్వరలో ఏనుగుల తరలింపు: మంత్రి

image

ఏనుగులను ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి త్వరలో తరలిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పంటలకు భారీ నష్టం వాటిల్లిందని, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఏనుగులను తరలించేందుకు కుంకీ ఏనుగులు వస్తాయని మంత్రి తెలిపారు. కురుపాం మండలంలోని మారుమూల గ్రామాల్లో రెండు రోడ్లను మంత్రి ప్రారంభించారు.

Similar News

News April 18, 2025

NZB: పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ

image

నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను సీపీ సాయి చైతన్య శుక్రవారం తనిఖీ చేశారు. 3, 4, రూరల్ పోలీస్ స్టేషన్‌లను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారు లేదా అని ఆరా తీశారు. వాహనాల పార్కింగ్ స్థలాన్ని చూశారు. గంజాయి, సైబర్ నేరాల నిర్మూలనకు కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

News April 18, 2025

విశాఖలో దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్‌.. పోలీసుల సూచనలు

image

విశాఖ పోర్ట్ స్టేడియంలో శనివారం నిర్వహించే దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్‌కు వచ్చే వారికి పోలీసులు శుక్రవారం పలు సూచనలు చేశారు. వీఐపీ టికెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రధాన గేటు ద్వారా ఎంట్రీ ఉంటుందన్నారు. వారి వాహనాలకు లోపల పార్కింగ్ చేసుకోవాలన్నారు. సాధారణ టికెట్లు ఉన్నవారికి పోర్ట్ స్టేడియం వెనుక గేటు నుంచి ప్రవేశం ఉంటుందన్నారు. వారి వాహనాలు నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలన్నారు.

News April 18, 2025

GHMC పరిధిలో నమోదైన వర్షపాతం..!

image

HYDలో భారీ వర్షం కురుస్తుంది. అత్యధికంగా రెయిన్‌బజార్ యాకుత్‌పురాలో 56.5 మి.మీ, డబీర్‌పుర బలశెట్టి వాటర్ ట్యాంక్ వద్ద 48.5 మిమీ, దూద్‌బౌలి 46.5 మిమీ వర్షం నమోదైంది. గన్‌ఫౌండరీ, రూపాల్ బజార్ 2 చోట్లా 41 మిమీ, నాంపల్లిలో 40.5 మిమీ, అజంపురాలో 38.5 మిమీ, కంచన్‌బాగ్‌లో 36.8 మిమీ, ఎడిబజార్‌లో 33.3 మిమీ, కుత్బుల్లాపూర్ ఆదర్శ్‌నగర్‌లో 31.5 మిమీ వర్షపాతం కురిసింది.

error: Content is protected !!