News December 17, 2025

త్వరలో కొత్త సర్పంచులతో సీఎం సమావేశం

image

TG: కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన కొత్త సర్పంచులతో CM రేవంత్ భేటీ కానున్నారు. ఇవాళ తుది విడత పంచాయతీ ఎన్నికలు జరగనుండగా ఈ నెల 20న సర్పంచుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ తర్వాత HYDలో సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని CM నిర్ణయించారు. సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం, సంస్థాగతంగా కాంగ్రెస్ క్యాడర్‌ను బలోపేతం చేయడంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

Similar News

News December 18, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.1,34,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 ఎగబాకి రూ.1,23,600 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,24,000కు చేరింది. వెండి ధర రెండ్రోజుల్లోనే రూ.13వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 18, 2025

పొగచూరిన ఢిల్లీ.. విమానాలు, రైళ్లు ఆలస్యం

image

ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాల్సిన 40 విమానాలు ఆలస్యమయ్యాయి. అటు ఫాగ్ వల్ల 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డుపై వచ్చిపోయే వాహనాలేవీ కనిపించడంలేదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికులు నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా నిన్న లక్నోలో పొగ మంచు వల్ల భారత్-సౌతాఫ్రికా టీ20 మ్యాచ్ కూడా రద్దయిన విషయం తెలిసిందే.

News December 18, 2025

మేకప్ బావుండాలంటే ఇలా చేయండి

image

అందంగా కనిపించాలని చాలామంది మేకప్ వేస్తుంటారు. అయితే కొన్ని మిస్టేక్స్ వల్ల మేకప్ చూడటానికి బాగోదు. ఇలా కాకుండా ఉండాలంటే మేకప్‌కి ముందు మాయిశ్చరైజర్ తప్పకుండా రాయాలి. కన్సీలర్ బదులు కలర్ కరెక్టర్ అప్లై చెయ్యాలి. మేకప్‌కి ముందు ప్రైమర్ రాసుకుంటే మేకప్ ఈవెన్‌గా వస్తుంది. పౌడర్ నుదురు, చెంపలకు రాస్తే సరిపోతుంది. లిప్‌స్టిక్ షేడ్ మీ పెదవులు, చర్మ రంగుకు నప్పేలా చూసుకోవాలి.