News December 21, 2024
త్వరలో ‘టైమ్స్ ఆఫ్ చిత్తూరు’ సినిమా

తాను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చిత్తూరు ఎలా ఉందనే అంశంపై సినిమా తీస్తున్నట్లు MLA జగన్ మోహన్ ప్రకటించారు. ఇందులో వివిధ పార్టీల రాజకీయ నాయకుల ప్రస్తావన ఉంటుందని చెప్పారు. ‘టైమ్స్ ఆఫ్ చిత్తూరు’ పేరిట వచ్చే ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పాత్రలు, స్వభావాలు అంటూ ఇందులో సీకే బాబు, బుల్లెట్ సురేశ్, విజయానందరెడ్డి తదితరుల పేర్లతో కూడిన పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి.
Similar News
News November 6, 2025
దూడపై చిరుతపులి దాడి.?

ఐరాల మండలం వడ్రంపల్లిలో బుధవారం రాత్రి ఓ అడవి జంతువు దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా చిరుతపులి డాడి చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాణిపాకం ఆలయానికి 4 కిలోమీటర్ల సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 5, 2025
చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జట్టు ఇదే..!

చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక సదుంలో బుధవారం జరిగింది. ధరణీధర, బాలాజీ, భరత్ కుమార్, మహేంద్ర, సుధీర్(సదుం), వెంకటేశ్, ప్రసన్నకుమార్, ప్రిన్స్ (నిండ్ర), సతీష్(పలమనేరు), హర్షవర్ధన్(ఏఎన్ కుంట), నిఖిల్(దిగువమాఘం), ప్రవీణ్ కుమార్ (చిత్తూరు), సుశీల్ (సిద్ధంపల్లె), గోకుల్(అరగొండ), ప్రవీణ్ కుమార్ నాయక్(పీలేరు) ఎంపికైనట్లు నిర్వాహకులు చెప్పారు.
News November 5, 2025
తిరువన్నామలైలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలైకు బుధవారం వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశక్తి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు ఆలయ మర్యాదలతో సన్మానించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి ఉన్నారు.


