News July 25, 2024

త్వరలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తాం: భట్టి

image

తెలంగాణకు గర్వకారణమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమను తెరిపించేందుకు కనీస శ్రద్ధ చూపించలేదన్నారు. తాము త్వరలోనే ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

Similar News

News November 28, 2024

MDK: జనవరి వరకు చలిపంజా.. జాగ్రత్తలు తప్పనిసరి !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో జనవరి వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కావున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో జలుబు, దగ్గు రావడతతోపాటు కండరాలు కుచించుకుపోయి రక్తనాళాలు గడ్డ కట్టుకుపోయి ఇతర జబ్బులు వచ్చే ఆస్కారముందన్నారు. ప్రస్తుతం చలికాలం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వేడి చేసిన నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

News November 28, 2024

సంగారెడ్డి: డిసెంబర్ 4న నాస్ పరీక్ష

image

సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో డిసెంబర్ 4న నేషనల్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే (నాస్) పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ నాస్ పరీక్షకు విద్యార్థులను సంసిద్ధులుగా చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

News November 27, 2024

సంగారెడ్డి: క్రిస్టియన్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

క్రిస్మస్ సందర్భంగా గౌరవ సత్కారం కోసం అర్హులైన క్రిస్టియన్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. సామాజిక, సేవారంగం, విద్యారంగం, వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించిన సంస్థలు, వ్యక్తులు డిసెంబర్ 5వ తేదీ లోగా కలెక్టర్ కార్యాలయంలోని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.