News December 28, 2025

త్వరలో పాలమూరుకు కేసీఆర్‌: శ్రీనివాస్‌ గౌడ్‌

image

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరలోనే పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ఆదివారం పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధుల సన్మాన సభలో ఆయన మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడం కాంగ్రెస్‌కు చేతకావడం లేదని విమర్శించారు.

Similar News

News December 29, 2025

రక్షణ రంగంలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు

image

భారత రక్షణ రంగంలో అదానీ గ్రూప్ రూ.1.8 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి మానవరహిత, అడ్వాన్స్‌డ్ గైడెడ్ వెపన్స్, డ్రోన్లు, స్మార్ట్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టి సారించనుంది. AI ఆధారిత యుద్ధ సాంకేతికతతో సైనికుల ప్రాణాపాయాన్ని తగ్గించాలన్నది సంస్థ ఉద్దేశం. ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన ‘దృష్టి-10’ యూఏవీలు(Unmanned Aerial Vehicles) భారత నౌకాదళంలో సేవలందిస్తున్నాయి.

News December 29, 2025

మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచే అలవాట్లు

image

సిగరెట్లు, మద్యం తాగే మహిళలకు పురుషుల కంటే క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. పొగాకులోని హానికారకాలకు మహిళల్లోని ఈస్ట్రోజెన్ వంటి కొన్ని ఎంజైమ్‌లు, హార్మోన్లు స్పందించే తీరు భిన్నంగా ఉంటుందని ఇది క్యాన్సర్‌ కారకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు, ఎంఫిసెమా, ఇతర తీవ్రమైన అనారోగ్యాల ముప్పును కూడా పెంచుతుంది.

News December 29, 2025

MDK: విషాదాంతంగా మారిన విహారయాత్ర

image

గోవా విహారయాత్రకు వెళ్లిన యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన పలువురు 15 మంది యువకులు మూడు కార్లలో గోవా విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సోలాపూర్ వద్ద కారు బోల్తా పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో రిహాన్, పవన్ కుమార్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు బంధువులు తెలిపారు.