News October 29, 2025
త్వరలో మదనపల్లి జిల్లా సాకారం?

ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు జిల్లాలుగా మారింది. నాడు మదనపల్లిని అన్నమయ్య జిల్లాలో కలపడం కంటే జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ బలంగా వినిపించింది. దీనికి అనుకూలంగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై సీఎం చర్చించారు. త్వరలో దీనిపై ఆమోదం తెలిపి మదనపల్లి జిల్లా కేంద్రం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు పుంగనూరు లేదా పీలేరు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. జిల్లా కేంద్రం మదనపల్లిపై మీ కామెంట్.
Similar News
News October 29, 2025
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (పోక్సో స్పెషల్ జడ్జ్) ఎస్.సరిత మంగళవారం తీర్పు చెప్పారు. మణుగూరు(M) వాగు మల్లారానికి చెందిన మైనర్ బాలికపై జానంపేటకు చెందిన గాడిద శ్రీనివాస్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో 11 మంది సాక్షులను విచారించగా శ్రీనివాస్‌పై నేరం రుజువైంది. దాంతో శిక్ష పడింది.
News October 29, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 643mm వర్షపాతం

పార్వతీపురం మన్యం జిల్లాలో గడిచిన 24గంటల్లో 643mm వర్షపాతం నమోదైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. అత్యధికంగా పాచిపెంట68.2mm, అత్యల్పంగా వీరఘట్టం28.8mm నమోదుకాగా భామిని 50.9mm, జియ్యమ్మవలస 35.8mm, సీతంపేట 66.9mm, గుమ్మలక్ష్మీపురం39.2mm, కొమరాడ29.4mm, కురుపాం36.3mm, Gbl44.2.8mm, సాలూరు48.1mm, పార్వతీపురం34.6, పాలకొండ47.2mm, మక్కువ 41.8mm, సీతానగరం 29mm, బలిజిపేట42.6mm వర్షపాతం నమోదయ్యిందన్నారు.
News October 29, 2025
నల్గొండ: గౌడన్నా జర భద్రం!

నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, గౌడ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. తడిసిన చెట్ల కాండాలు జారే ప్రమాదం ఉందని, ఇది ప్రాణాలకే ముప్పు తెస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా చెట్టుపై పట్టు దొరకకపోవచ్చని, తుఫాను తగ్గేంత వరకు గీత వృత్తికి విరామం ఇవ్వాలని కోరుతున్నారు.


