News October 29, 2025

త్వరలో మదనపల్లి జిల్లా సాకారం..?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు జిల్లాలుగా మారింది. నాడు అన్నమయ్య జిల్లాకు కలవడం కంటే మదనపల్లి జిల్లా కావాలని డిమాండ్ బలంగా వినిపించింది. దీనికి అనుకూలంగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై సీఎం చర్చించారు. త్వరలో దీనిపై ఆమోదం తెలిపి మదనపల్లి జిల్లా కేంద్రం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు పుంగనూరు లేదా పీలేరు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. జిల్లా కేంద్రం మదనపల్లిపై మీ కామెంట్ చెప్పండి..!

Similar News

News October 29, 2025

శేషాచలం కనుమల్లో కనుగొన్న గెక్కో జాతి బల్లి

image

ఏపీ తూర్పు కనుమల్లో కొత్తగా ఒక గెక్కో జాతి గుర్తించారు. తిరుమల వెంకటాద్రి పర్వత ప్రాంతంలోని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్‌లో ZSI శాస్త్రవేత్తల బృందం ఈ చిన్న బల్లిని కనుగొంది. Hemiphyllodactylus venkattadri అనే పేరుతో నమోదు చేసిన ఈ జాతి, జన్యు పరీక్షల్లో ఇప్పటివరకు తెలిసిన ఇతర సన్నని గెక్కో జాతుల కంటే భిన్నమని తేలింది. ఇది ఏపీలో కనుగొనబడిన రెండో హెమిఫిల్లోడాక్టిలస్ జాతి.

News October 29, 2025

వనపర్తి: భారీ వర్షాలు… ఇంటర్ కళాశాలలకు సెలవు

image

భారీ వర్షాల కారణంగా వనపర్తి జిల్లాలోని అన్ని ఇంటర్ కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. కళాశాలలకు వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున ముందస్తుగా ఈ సెలవు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపల్‌లకు సమాచారం ఇచ్చారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఆయన సూచించారు.

News October 29, 2025

WGL: మొంథా తుఫాన్ ప్రభావం.. వర్షపాతం వివరాలు

image

మొంథా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఉదయం 8:30 గంటల నుండి 10:00 గంటల వరకు అత్యధిక వర్షపాతం రాయపర్తి మండలంలో 55.8 mm, వర్దన్నపేటలో 54.5mm నమోదైంది. పర్వతగిరి మండలంలో 42.8 mm, నెక్కొండలో 34.6 mm, ఖానాపూర్‌లో 34.0, చెన్నారావుపేటలో 19.5mm, సంగెంలో 12.3 mm, నర్సంపేటలో 9.0mm నమోదయ్యాయి.