News August 25, 2025
త్వరలో మదనపల్లె జిల్లా ప్రకటన..?

మదనపల్లె జిల్లా ఏర్పాటుపై త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా అధికారులు పనిచేస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. జిల్లా హద్దులపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారంట. మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లెతో కలిపి నూతన జిల్లాగా ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ రానుంది.
Similar News
News August 25, 2025
NZB: ర్యాగింగ్‌కు పాల్పడితే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి

ర్యాగింగ్‌కు పాల్పడటం నేరమని NZB జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కరరావు అన్నారు. సోమవారం ఆయన నిజామాబాద్ మెడికల్ కాలేజీని సందర్శించారు. రెండు రోజుల క్రితం కళాశాలలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను యాంటీ ర్యాగింగ్ కమిటీ నుంచి తెలుసుకున్నారు. అనంతరం వైద్య విద్యార్థులతో మాట్లాడారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే లీగల్ సెల్ 9440901057కు సంప్రదించాలని సూచించారు.
News August 25, 2025
రాష్ట్రస్థాయి యోగ పోటీలకు వేంపేట విద్యార్థులు

రాష్టస్థాయి యోగా పోటీలకు వేంపేట ZPHS విద్యార్థులు ఎంపికయ్యారు. జగిత్యాల యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి యోగా పోటీలలో చుక్కబొట్ల హేమచంద్ర ప్రథమ స్థానంలో నిలువగా, శ్రీరాముల కార్తికేయ ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వచ్చేనెల 5, 6, 7 తేదీలలో నిర్మల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. వారిని ప్రధానోపాధ్యాయురాలు నాగరాజకుమారి తదితరులు అభినందించారు.
News August 25, 2025
VZM: కలువ పువ్వు కోసం వెళ్లి మృతి

గంట్యాడ మండలం మదనాపురం గ్రామానికి చెందిన లగుడు సురేష్(40) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. గంట్యాడ ఎస్ఐ సాయి క్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మదనాపురం గ్రామంలో కలువ పువ్వులు తీసుకునేందుకు ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో లోతు ఎక్కువగా ఉండడంతో మునిగి మరణించాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.