News June 29, 2024
త్వరలో మరో రెండు పంప్ హౌస్‌లు ట్రయల్ రన్ : కలెక్టర్
అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను కలెక్టర్ జితేశ్ శుక్రవారం సందర్శించారు. ఆయనకు జలవనరులశాఖ అధికారులు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. పూసుగూడెం, కమలాపురం వద్దనున్న పంప్‌హౌస్‌లు ట్రయల్ రన్‌కు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలోని 104 కిలోమీటర్ల సీతారామ ప్రధాన కాల్వ ద్వారా జలాలను వదిలేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు.
Similar News
News November 30, 2024
ఖమ్మం: వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజుల సెలవు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు రెండు రోజుల సెలవులు ప్రకటించారు. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారులు కోరారు.
News November 30, 2024
సీనియర్ సిటిజన్స్‌కు వైద్య సేవలు అందించాలి: కలెక్టర్
సీనియర్ సిటిజన్స్ కు జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ప్రాధాన్యతతో ఒకేచోట వివిధ వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో సీనియర్ సిటిజన్‌ల కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య సేవల విభాగాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే వయో వృద్ధులకు సీనియర్ సిటిజన్ వైద్య సేవల విభాగం ద్వారా సంపూర్ణ సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు.
News November 30, 2024
ప్రభుత్వ విద్యా సంస్థల బంద్‌కు పిలుపు
ప్రభుత్వ విద్యా సంస్థల్లో వరసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ రేపు ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అనేక మరణాలు జరిగాయని వారు ఆరోపించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ఎగ్స్ గ్రేషియా చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. SFI,PDSU,AISF సంఘాలు బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆసంఘాల ప్రతినిధులు తెలిపారు.