News January 29, 2025
త్వరలో మరో 2 కొత్త ఐటీ పార్కులు: మంత్రి శ్రీధర్ బాబు

త్వరలో హైదరాబాద్‌లో మరో 2 కొత్త ఐటీ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు. హైటెక్ సిటీ మాదిరిగా రెండు కొత్త ఐటీ పార్కులను అభివృద్ధి చేస్తామని అన్నారు. పార్కుల ఏర్పాటు కొరకు స్థల పరిశీలన జరుగుతుందన్నారు. హైదరాబాద్‌ను వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కేంద్రంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త ఐటీ పార్కులను అభివృద్ధి చేయనుంది.
Similar News
News February 15, 2026
కడపలో ఆ నేతకు పిలుపు లేదా? వెళ్లలేదా?

కడప జిల్లా కూటమి MLAలు, TDP ఇన్‌ఛార్జ్‌లతో సీఎం చంద్రబాబు నిన్న సమావేశమయ్యారు. వారి పనితీరుకు సంబంధించి ఒక రిపోర్టును సీఎం ఇచ్చారు. అలాగే నియోజకవర్గాల్లోని సమస్యలను సీఎంతో చర్చించారు. అయితే ఈ సమావేశంలో బద్వేల్ TDP ఇన్‌ఛార్జ్ రితేశ్ రెడ్డి పాల్గొనలేదు. దీనికి ఆయనకు పిలుపులేదా? లేక ఇంకేదైనా కారణం ఉందనేది తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల ఏర్పడ్డ వర్గపోరే కారణమని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
News February 15, 2026
ఉమ్మనీరు పెరగడానికి ఈ చిట్కాలు

ప్రెగ్నెన్సీలో సరైన మోతాదులో ఉమ్మనీరు ఉండటం చాలా ముఖ్యం. లేదంటే బిడ్డకు పలు ఇబ్బందులు ఎదురవుతాయి. దీనికోసం * వీలైనంత ఎక్కువగా నీళ్లు, జ్యూసులు, కొబ్బరినీళ్లు, బార్లీ తాగాలి. * నీరు అధికంగా ఉండే దోసకాయలు, పాలకూర, బ్రకోలీ, టమాటా, కాలీఫ్లవర్, క్యారెట్ తీసుకోవాలి. పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ, స్ట్రాబెర్రీ పండ్లు తీసుకోవాలి. * ఆహారంలో మార్పులు చేసుకున్నా ఉమ్మనీరు పెరగకపోతే డాక్టర్లను సంప్రదించాలి.
News February 15, 2026
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ రిపోర్ట్‌ను నమ్మొద్దు: కేంద్రం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక రాసిన <<19116627>>కథనాన్ని<<>> భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. పైలట్ కావాలనే ఇంజిన్లు ఆపేశాడన్న వార్తలు అసత్యమని, విచారణ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. విదేశీ ఏజెన్సీల ఊహాగానాలను నమ్మొద్దని, దేశీయ దర్యాప్తు సంస్థలపై విశ్వాసం ఉంచాలని పౌరవిమానయాన శాఖ సూచించింది. 260 మంది మరణించిన ఈ ఘటనపై తుది నివేదిక వచ్చిన తర్వాతే వాస్తవాలు వెల్లడిస్తామని పేర్కొంది.


