News March 22, 2026
త్వరలో యాదాద్రికి MMTS

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు త్వరలో రైల్వే శాఖ తీపి కబురు అందించనుంది. వచ్చే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా MMTS రెండో దశ పనులకు అంకురార్పణ జరగనుంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు 33KM మేర కొత్త లైన్ నిర్మించి, రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భక్తులు అతి తక్కువ ఖర్చుతో నేరుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.
Similar News
News April 1, 2026
జగిత్యాల జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా ఎండ ప్రభావం కొనసాగుతోంది. వర్షం నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. మంగళవారం రాఘవపేటలో అత్యధికంగా 39.5℃ నమోదైంది. ఐలాపూర్, గోదూరు 39.4, గుల్లకోట 39, మెట్పల్లి, కోరుట్ల 38.6, కొల్వాయి 38.4, మల్లాపూర్ 38.1, అల్లీపూర్, జైన 37.9, వెల్గటూర్ 37.7, మేడిపల్లి 37.2, జగ్గసాగర్ 37.1, రాయికల్ 36.9, సారంగాపూర్ 36.8, గొల్లపల్లి 36.7, పెగడపల్లి 36.6℃ నమోదయ్యాయి.
News April 1, 2026
KMR: కట్టెల పొయ్యికి ‘ఫ్యాన్’ పెట్టారు

కామారెడ్డి(D) పిట్లంలోని ఓ హోటల్ యజమాని కట్టెల పొయ్యి మంటను పెంచేందుకు సరికొత్త పద్ధతిని పాటిస్తున్నారు. సాధారణంగా ఊదడం లేదా విసనకర్రతో గాలి మళ్లించడం కాకుండా, టేబుల్ ప్యాన్‌ను ఉపయోగించి మంటను వేగంగా రాజేస్తున్నారు. దీనివల్ల పొగ తక్కువగా వస్తుందని, వంటలు కూడా త్వరగా పూర్తవుతున్నాయని ఆయన తెలిపారు. శ్రమ తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుండటంతో, ఆయన చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం విశేషంగా ఆకర్షిస్తోంది.
News April 1, 2026
కూపర్.. బ్యాటింగ్ సూపర్

PBKS బ్యాటర్ కూపర్ కన్నోలి నిన్న GTపై ఆడిన IPL అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టారు. మిగతా బ్యాటర్లు ఔట్ అవుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా చెలరేగారు. 44 బంతుల్లోనే 5ఫోర్లు, 5సిక్సులతో 72* రన్స్ చేసి జట్టును గెలిపించారు. దీంతో డెబ్యూ మ్యాచులో POTM అవార్డు అందుకున్న ప్లేయర్ల లిస్టులో చేరారు. కూపర్ కంటే ముందు ఈ జాబితాలో 18మంది ఉన్నారు. ఇక PBKS 2011 నుంచి లీగ్‌లో ఆడిన అన్ని తొలి మ్యాచుల్లో గెలుస్తూ వస్తోంది.


