News February 10, 2025
త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం: పరశురాం

త్వరలో దిల్ రాజు నిర్మాతగా సినిమా షూటింగ్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రముఖ డైరెక్టర్ పరశురాం వెల్లడించారు. సోమవారం అనకాపల్లి జిల్లా జల్లూరులో పర్యటించిన ఆయన పలు విషయాలు పంచుకున్నారు. సినిమా షూటింగ్‌కు అవసరమైన స్క్రిప్ట్ పూర్తయిందన్నారు. తను ఇప్పటివరకు ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 13, 2026
పతనమైన ఉల్లి ధరలు.. రైతుల కన్నీరు

కొత్తపల్లి మండల పరిధిలో ఉల్లి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర క్వింటా రూ.300కి పడిపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంట కోతకు పెట్టే ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసిన ఉల్లిని అమ్మేందుకు మార్కెట్‌లో సరైన ధర లేక పెట్టుబడులు కూడా వృథా అవుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
News April 13, 2026
మెదక్: ఈ అమ్మాయిలు GREAT

ఇంటర్ ఫలితాల్లో మెదక్ మైనారిటీ బాలికల కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించి స్టేట్ ర్యాంకులు సైతం కైవసం చేసుకున్నారు. BiPC-1లో హారిక 438/440 సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, MPC-1లో శృతిక, ఆఫహ బేగం ఇద్దరూ 467/470 సాధించి స్టేట్ 2వ, BiPC -1లో శ్రావణి 436/440 సాధించి స్టేట్ 3వ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. MPC-2లో అక్షయ 990/1000 సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
News April 13, 2026
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఈ రైళ్లు రద్దు

వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విజయవాడ సమీపంలోని రాయనపాడు యార్డ్ ఆధునీకరణ పనుల కారణంగా ఈనెల 28 నుంచి మే 5 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శాతవాహన, ఇంటర్సిటీ (గుంటూరు-SEC), గోల్కొండ సహా పలు రైళ్లు రద్దు కాగా, విజయవాడ-భద్రాచలం, విజయవాడ- డోర్నకల్ ప్యాసింజర్ రైళ్లు సైతం రద్దయ్యాయని, ప్రయాణికులు విషయాన్ని గమనించాలని కోరింది.


