News December 31, 2025
త్వరలో 14వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: DGP

TG: పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు డీజీపీ శివధర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో 14వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని నిన్న ప్రెస్ మీట్‌లో ప్రకటించారు. ప్రభుత్వానికి ఖాళీల ప్రతిపాదనలు పంపామని, త్వరలో అనుమతి రానుందని చెప్పారు. కాగా రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 3 సార్లు (2016, 2018, 2022) మాత్రమే నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి వస్తోంది.
Similar News
News January 2, 2026
ఏపీకి రానున్న సోనియా గాంధీ, రాహుల్

AP: ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బండ్లపల్లిలో చేపట్టే ఆందోళనల్లో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక పాల్గొననున్నారు. ఈ గ్రామంలోనే 2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. దీంతో అదే రోజున, అదే ప్రాంతంలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు.
News January 2, 2026
రూ.7వేల కోట్లతో హైదరాబాద్‌కు గోదావరి జలాలు: సీఎం రేవంత్

TG: ఏడాదంతా మూసీనదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పారు. రూ.7వేల కోట్ల ఖర్చుతో గోదావరి నదీ జలాలను (15 టీఎంసీలు) హైదరాబాద్‌కు తరలిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో నదీపరివాహక ప్రాంతాల అభివృద్ధిని ఎన్నికల అజెండాగా పెట్టుకున్న బీజేపీ.. ఇక్కడెందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు.
News January 2, 2026
గొంతునొప్పి తగ్గాలంటే..

ఎవరైనా శీతాకాలంలో ఎక్కువ ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుంటారు. జలుబు, గొంతునొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి కామన్‌గా వస్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే వీటికి చెక్ పెట్టొచ్చు.
☛గొంతునొప్పి వస్తే గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని పుక్కిలిస్తే రిలీఫ్‌గా ఉంటుంది. ☛గొంతునొప్పి ఉన్నప్పుడు మిరియాల పాలు తాగినా అద్భుతంగా పనిచేస్తుంది. గొంతులోని ఇన్ఫెక్షన్ పోతుంది.


