News January 2, 2026

త్వరలో 265 పోస్టుల భర్తీ: మంత్రి కోమటిరెడ్డి

image

TG: R&B శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్‌లో ఉండే AEలకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. R&B ఇంజినీర్స్ డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. తమ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమన్నారు. తర్వాత ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.

Similar News

News February 15, 2026

‘బాషా’ నిర్మాత కన్నుమూత

image

ప్రముఖ తమిళ నిర్మాత, డైరెక్టర్ తమిళ్ అళగన్ కన్నుమూశారు. ఈయన మరణంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అళగన్ ప్రొడ్యూసర్‌గా బ్లాక్‌బస్టర్ ‘బాషా’, చిరంజీవి-రజినీ కాంబోలో ‘రానువ వీరన్’(తెలుగులో బందిపోటు సింహం) తదితర చిత్రాలను నిర్మించారు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. కాగా తమిళనాట లెజెండరీ ప్రొడ్యూసర్, రచయిత, మాజీ మంత్రి ఆర్ఎమ్ వీరప్పన్ కొడుకే ఈ అళగన్.

News February 15, 2026

భక్తురాలి అమాయకత్వానికి లొంగిపోయిన ఈశ్వరుడు

image

శివభక్తురాలైన గొడగూచిని తన తండ్రి ఊరెళ్తూ శివలింగానికి పాలు నైవేద్యంగా సమర్పించమని చెబుతాడు. గొడగూచి అమాయకమైన భక్తితో శివుడిని పాలు తాగమని వేడుకొంది. శివుడు పాలు తాగలేదు. దీంతో తనేమైనా తప్పు చేశానేమో అని బాధపడింది. ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఆమె నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమె చేతి పాలు తాగాడు. అలిగి, అల్లరి చేసిన ఆ చిన్నారి భక్తురాలిని తనలో లీనం చేసుకున్నాడు.

News February 15, 2026

100 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల

image

ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(AFMS) షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 100 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. MBBS, పీజీ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు MBBS అర్హత గలవారికి 30ఏళ్లు, పీజీ అర్హత గలవారికి 35ఏళ్లు. ఫిజికల్ ఫిట్‌నెస్ కలిగి ఉండాలి. వెబ్‌సైట్: www.join.afms.gov.in