News February 19, 2026
త్వరలో DSC.. కర్నూలు జిల్లాకు అధిక ప్రాధాన్యం: మంత్రి లోకేశ్

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం చాలా వెనుకబడి ఉందని, యువగళం పాదయాత్రలో కళ్లారా చూశానని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో అన్నారు. ‘ఆ ప్రాంతాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తున్నాం. గత DSCలో ఆ జిల్లాకు ఎక్కువ మంది టీచర్లను నియమించాం. అయినా స్టూడెంట్, టీచర్ రేషియో తక్కువగా ఉంది. త్వరలో DSC ప్రకటించబోతున్నాం. జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తాం’ అని చెప్పారు.
Similar News
News February 19, 2026
చిత్తూరు: అంతా నాయకుల కనుసన్నల్లోనే.?

స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కౌండిన్య, నీవా నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందట. తెలిసినా అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొందట. కొందరు మనకెందుకులే అన్నట్లు మౌనంగా ఉంటున్నారట. గంగవరం, పలమనేరు ప్రాంతాలకు చెందిన కొందరు నేతల పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తవణంపల్లె-పూతలపట్టు సరిహద్దులోని నీవా నది ఓ బడా నేత ఆక్రమణల ధాటికి మౌలిక స్వరూపమే కోల్పోతోందట. ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
News February 19, 2026
హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్లు.. ₹70,000 కోట్లకు లెక్క లేదు!

హైదరాబాద్ బిర్యానీ చైన్ రెస్టారెంట్స్ ₹70,000 కోట్ల మేర సేల్స్ లెక్కల్లో చూపలేదని ఆదాయపన్ను శాఖ గుర్తించింది. బిల్స్ డిలీట్, ఎడిటింగ్ వంటివి చేస్తూ తక్కువ సేల్ చూపించి పన్ను ఎగ్గొడుతున్నట్లు గుర్తించింది. బిల్లింగ్‌కు వాడే సాఫ్ట్‌వేర్ డేటాను Ai సహా లేటెస్ట్ టూల్స్‌తో విశ్లేషించగా ఇది తెలిసింది. 2019-20 సం. నుంచి విశ్లేషించిన 10% డేటాతో TN, KA, TG, MH, GJ రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉందని తేలింది.
News February 19, 2026
చిత్తూరు: మామిడి రైతులకు రూ.1కే.!

మామిడి కవర్లను 50% సబ్సిడీపై అందించనున్నట్లు చంద్రగిరి HO శైలజ గురువారం తెలిపారు. రైతుకు గరిష్ఠంగా 1హెక్టారుకు 15 వేల కవర్లు ఇస్తామని, ఒక కవరు రూ.2లు కాగా, రైతు రూ.1 చెల్లించాలన్నారు. చంద్రగిరి, పాకాల (M) లోని ఆసక్తి గల రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు, పాస్ బుక్, ఫొటోతో రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కవర్ల వలన పంటకు పురుగుల దెబ్బ, వ్యాధులు తగ్గి నాణ్యమైన దిగుబడి వస్తుందని HO తెలిపారు.


