News July 9, 2025
త్వరితగతిన పనులను పూర్తి చేయాలి: సిరిసిల్ల కలెక్టర్

బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని వారు పరిశీలించి మాట్లాడారు. బ్రిడ్జిని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Similar News
News July 10, 2025
MBNR: కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.
News July 10, 2025
కోరుట్ల: ‘మన ఊరు-మనబడి నిధులను మంజూరు చేయించాలి’

పెండింగ్‌లో ఉన్న ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి సంబంధించిన నిధులు మంజూరు చేయించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను కోరారు. బుధవారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వరద డ్యామేజ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని, దేవాదాయ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.
News July 10, 2025
జగిత్యాల: ‘పెండింగ్‌లో ఉన్న ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలి’

జగిత్యాల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఆలయాల నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను కోరారు. వైద్య పరంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మెడికల్ కాలేజీలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.