News February 5, 2026

థియేటర్లలోకి ‘మీర్జాపూర్’.. రిలీజ్ ఎప్పుడంటే?

image

పాపులర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ సినిమాగా SEP 4న థియేటర్లలోకి రానుంది. ‘మీర్జాపూర్ ది ఫిల్మ్’ పేరుతో రానున్న ఈ మూవీ సిరీస్‌లోని కొన్ని ముఖ్యమైన పాత్రలతో ఉంటుందని పేర్కొన్నారు. ఖాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా త్రిపాఠి వంటి పాత్రలు ఉంటాయని తెలిపారు. ఈ కథను పునీత్ కృష్ణ రాయగా గుర్మీత్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రితేశ్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్నారు.

Similar News

News February 15, 2026

ఏడాదిలో 250 గుడ్లు.. 6 నెలల్లో రెండున్నర kgల బరువు

image

గ్రామ ప్రియ కోళ్లు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్లు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఆరు నెలల వయసు వచ్చేసరికే రెండున్నర కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఏడాదిలో 250 గుడ్లను పెడతాయి. అధిక వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడవని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.

News February 15, 2026

మహాశివరాత్రి ఎందుకు జరుపుతారు?

image

మాఘ మాసంలో వచ్చే ‘మహాశివరాత్రి’ అత్యంత విశిష్టమైనది. బ్రహ్మ, విష్ణువుల అహాన్ని తొలగిస్తూ శివుడు అనంతమైన జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన(లింగోద్భవం) పవిత్ర దినమిది. అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుగానూ చెబుతారు. దేవతలు, రాక్షసులు, సమస్త జీవరాశులను తన వివాహానికి ఆహ్వానించి శివుడు ‘సమభావాన్ని’ చాటారు. అందుకే ఈ రోజున భక్తులు లింగోద్భవ కాల పూజలు, జాగరణాల ద్వారా ఆ మహాదేవుని అనుగ్రహం పొందుతారు.

News February 15, 2026

టెన్త్, ఐటీఐ అర్హతతో 260 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(CSL)లో 260 వర్క్‌మెన్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ITI, NTCతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నెలకు రూ.23,300 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://cochinshipyard.in