News December 2, 2025

థియేటర్లలో రొమాన్స్.. టెలిగ్రామ్‌లో వీడియోలు

image

థియేటర్లలో జంటలు సన్నిహితంగా ఉండే వీడియోలు టెలిగ్రామ్, Xలో దర్శనమివ్వడం కేరళలో కలకలం రేపింది. అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే థియేటర్లలో CCTV ఫుటేజీలు హ్యాక్ అయ్యాయి. సరైన సెక్యూరిటీ నెట్‌వర్క్ వ్యవస్థ లేకపోవడంతో ఈజీగా హ్యాక్ అయినట్లు నిపుణులు తెలిపారు. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్, బలమైన నెట్‌వర్క్, సరైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. థియేటర్లలో సన్నిహితంగా ఉండొద్దని చెబుతున్నారు.

Similar News

News March 9, 2026

ట్రోఫీతో గుడికి.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

image

1983 WC విజేత, TMC MP కీర్తి ఆజాద్ టీమ్ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. T20 WC ట్రోఫీతో <<19333290>>హిందూ ఆలయానికి<<>> వెళ్లడాన్ని తప్పుబట్టారు. టీమ్ఇండియా 140 కోట్ల భారతీయులు, అన్ని మతాలను రిప్రజెంట్ చేస్తుందని.. కేవలం ఒక మతానిదో లేదా జై షా కుటుంబానిదో కాదని విమర్శించారు. సిరాజ్ మసీదుకు లేదా శాంసన్ చర్చికి ట్రోఫీని తీసుకెళ్లలేదన్నారు. ఒకే మతం చుట్టూ విజయాన్ని తిప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.

News March 9, 2026

గ్యాస్ కొరత.. బెంగళూరులో హోటల్స్ బంద్!

image

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపేయడంతో హోటళ్లను ఆపరేట్ చేయలేకపోతున్నామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘పశ్చిమాసియాలో యుద్ధం వల్ల వాణిజ్య వంట గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయింది. రేపటి నుంచి బెంగళూరులోని రెస్టారెంట్లు బంద్ అవుతాయి’ అని ఓ ప్రకటనలో తెలిపింది.

News March 9, 2026

అప్పటిదాకా పెట్రోల్ రేట్లు పెరగవు: ప్రభుత్వ వర్గాలు

image

దేశంలో అవసరమైనంత మేర నిల్వలు ఉన్నాయని, ఇంధన ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘క్రూడాయిల్ ధరలు 130 డాలర్లకు(ఒక బ్యారెల్‌కు) చేరే దాకా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. చమురు రేటు బ్యారెల్‌కు 100 డాలర్లుగా స్టెబిలైజ్ అవుతుంది. దేశంలో ఏ పెట్రోల్ పంపులోనూ కొరత లేదు. వివిధ మార్గాల ద్వారా క్రూడ్ సేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది’ అని వివరించాయి.