News April 18, 2024
దంచికొడుతున్న ఎండ… పమ్మిలో అత్యధికం

జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఏకంగా 44.2 డిగ్రీలకు చేరింది. జిల్లాలోని ముదిగొండ మండలం పమ్మిలో గరిష్టంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8గంటలకే ఎండ మొదలై పది గంటల తర్వాత బయటకు రాలేని పరిస్థితి ఉంటోంది. కాగా, ఖమ్మంలో 43.9, కూసుమంచిలో 43.7, కల్లూరులో 43.6, నేలకొండపల్లిలో 43.5, తల్లాడ, తిరుమలాయపాలెంల్లో 43.3, తిమ్మారావుపేటలో 43.2, చింతకాని 43.1, సత్తుపల్లిలో 42డిగ్రీల మేర నమోదైంది.
Similar News
News April 21, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు

ఖమ్మం జిల్లాలో సోమవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముదిగొండ (బాణాపురం)లో 41.5, నేలకొండపల్లిలో 41.3, ఎర్రుపాలెంలో 41.0, చింతకాని, మధిరలో 40.9, కామేపల్లి (లింగాల), కారేపల్లిలో 40.7, రఘునాథపాలెం, వేంసూరులో 40.3, వైరా 40.2, సత్తుపల్లి 40.0, పెనుబల్లి 39.9, ఖమ్మం అర్బన్ 39.7, తిరుమలాయపాలెం 39.4, ఖమ్మం (R) పల్లెగూడెం 39.2, తల్లాడ 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
News April 21, 2025
ఖమ్మం: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు రేపు విడుదల చేయనుంది. జిల్లాలో మొదటి సంవత్సరంలో 17,783 మందికి గాను 17,515 మంది, రెండవ సంవత్సరంలో 16,476 మందికి గాను 16,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST
News April 21, 2025
మధిర: వడదెబ్బకు సొమ్మసిల్లి వ్యక్తి మృతి

వడదెబ్బకు సొమ్మసిల్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధిర మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిదానపురం గ్రామానికి చెందిన మేసిపోగు రత్తయ్య(33)మేకలు మేపేందుకు పొలానికి వెళ్లాడు. సోమవారం అధిక ఎండలతో మధ్యాహ్నం ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.